Samsung Galaxy M13 5G Sale: శాంసంగ్ అత్యంత చవకైన 5జీ ఫోన్ - అమెజాన్‌లో సేల్ షురూ!
శాంసంగ్ చవకైన 5జీ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ.
శాంసంగ్ అత్యంత చవకైన 5జీ ఫోన్ గెలాక్సీ ఎం13 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో అందించారు. ఆటో డేటా స్విచ్చింగ్ టెక్నాలజీ కూడా ఈ ఫోన్లలో అందుబాటులో ఉంది. అంటే ఒక సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోతే రెండో సిమ్ సిగ్నల్ ద్వారా మొదటి సిమ్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చన్న మాట.
శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఆక్వా గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ, స్టార్‌డస్ట్ బ్రౌన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అంటే బేస్ వేరియంట్ రూ.12,749కే కొనేయచ్చన్న మాట.
శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 400 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు పెంచుకోవచ్చు.
128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ పని చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా బరువు 195 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై, 5జీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ సూట్ కూడా ఈ ఫోన్‌లో కంపెనీ అందించనుంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!