(Source: ECI/ABP News/ABP Majha)
Samsung Galaxy A53 5G Price Drop: శాంసంగ్ బెస్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు - ఎంత తగ్గిందంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ33 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. ఈ ఫోన్ మనదేశంలో మార్చిలో లాంచ్ అయింది. దీనిపై ఏకంగా రూ.3,500 తగ్గింపును అందించడం విశేషం. ఫోన్ ధరలో ఇది 10 శాతం. శాంసంగ్ ఏ53 5జీలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.34,999 కాగా, ఇప్పుడు రూ.31,499కు తగ్గింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 నుంచి రూ.32,999కు తగ్గించారు. అసమ్ బ్లాక్, అసమ్ బ్లూ, అసమ్ పీచ్, అసమ్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram