అన్వేషించండి

ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా - అయితే మీకు మరిన్ని ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఏ52 స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను అందించింది.

శాంసంగ్ గెలాక్సీ ఏ52 స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.0 అప్‌డేట్‌ను అందించారు. అయితే ఇది బీటా అప్‌డేట్ కాబట్టి సంబంధిత ప్రోగ్రాంకు సైన్ అప్ చేసుకున్నవారికి మాత్రమే లభిస్తుంది. ఈ అప్‌డేట్ ఇటీవలే శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఫోన్లకు అందించారు. ఇప్పుడు గెలాక్సీ ఏ52కు కూడా రానుంది.

ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.0 బీటా అప్‌డేట్ ద్వారా కొన్ని పర్సనలైజేషన్ ఆప్షన్లు రానున్నాయి. ఇది డివైస్‌కు అదనంగా ఫీచర్లను అందించనుంది. వీటిలో కొన్ని ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించినవి కాగా, కొన్ని వన్ యూఐకి సంబంధించినవి.

ఈ కొత్త అప్‌డేట్ ద్వారా 16 కొత్త కలర్ థీమ్స్ అందుబాటులోకి రానున్నాయి. మల్టీపుల్ విడ్జెట్లను హోం స్క్రీన్‌లో కంబైన్ చేయవచ్చు. వన్ యూఐ 5.0లో కూడా కొన్ని ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి కొన్ని బగ్స్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ శాంసంగ్ గెలాక్సీ ఏ52 మీ ప్రైమరీ డివైస్ కాకపోతే ఈ అప్‌డేట్‌ను ట్రై చేయండి. సెట్టింగ్స్‌లో అబౌట్ ఫోన్ ఆప్షన్‌లో సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌ను ఎంచుకోవడం ద్వారా ఈ ఫోన్ అప్‌డేట్ చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ52 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఏ52 పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ52 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా కాగా, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget