By: ABP Desam | Updated at : 10 Jun 2022 04:28 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్లు త్వరలో రానున్నాయి.
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ ఫోన్లు చైనాలో గత నెలలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఫోన్లను రూపొందించనుందని తెలుస్తోంది. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11టీ ప్రో, రెడ్‌మీ నోట్ 11టీ ప్రో ప్లస్, రెడ్‌మీ నోట్ 11 ఎస్ఈ ఫోన్లు ఉన్నాయి.
డిజిటల్ చాట్ స్టేషన్ అనే ఐడీ ఉన్న ప్రముఖ టిప్‌స్టర్ దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని ప్రకటించారు. అక్టోబర్‌లో ఈ ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉంది.
ఇందులో పంచ్ హోల్ ఉన్న ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువగా ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది.
రెడ్‌మీ నోట్ 11టీ ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.6 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 270 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10 ప్లస్ వంటి టాప్ క్లాస్ ఫీచర్లను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో అందించారు.
ఈ రెండు ఫోన్లూ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై పనిచేయనున్నాయి. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంలను ఈ ఫోన్లలో అందించారు.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!
Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!
Samsung A34 5G Sale: శాంసంగ్ ఏ34 5జీ సేల్ ప్రారంభించిన కంపెనీ - ఫీచర్లు చూశారా?
Samsung A54 5G Sale: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ షురూ - మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌ఫిప్‌లో విన్నర్ అవుతుందా?
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల