By: ABP Desam | Updated at : 25 Jun 2022 11:00 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించారు.
రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గతంలోనే లాంచ్ అయింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ మనదేశంలో తగ్గించింది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయి సంవత్సరం పైనే అవుతుంది. 2021 మేలో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
రెడ్‌మీ నోట్ 10ఎస్ ధర
ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 నుంచి రూ.12,999కు తగ్గింది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 నుంచి రూ.14,999కు తగ్గింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,499 నుంచి రూ.16,499కు తగ్గింది. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. కాస్మిక్ పర్పుల్, డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ నోట్ 10ఎస్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
డ్యూయల్ స్పీకర్లు, హైరిజల్యూషన్ ఆడియో వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 4జీ, వైఫై, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.82 సెంటీమీటర్లుగానూ, బరువు 178.8 గ్రాములుగానూ ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Jio 5G Phone: రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ - ప్రత్యేకతలు ఏంటంటే?
Vivo V25 Pro: ఊహించిన దాని కంటే తక్కువ ధరకే - లాంచ్ అయిన వివో వీ25 ప్రో!
Moto Razr 2022: ఐదు నిమిషాల్లో 10 వేల సేల్స్ - మోటొరోలా ఫోన్ కొత్త రికార్డు!
Samsung Galaxy: అదిరిపోయే స్మార్ట్ ఫోన్లకు ప్రీ బుకింగ్ షురూ, ఇప్పుడే బుక్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఇవే
Motorola Edge 30 Fusion: మనదేశంలో మోటొరోలా కొత్త ఫోన్ - లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంతో!
KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !
YSRCP Vs Janasena : వైఎస్ఆర్సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !
Common Charging Port: మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
Munugode Bypoll : రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల దండయాత్ర - మునుగోడు ముందు మునిగిపోతున్న టీ కాంగ్రెస్ !