Realme GT 2 Pro Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - రూ.ఐదు వేలు డిస్కౌంట్, స్మార్ట్ వాచ్ ఫ్రీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మీ జీటీ 2 ప్రోని ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.

FOLLOW US: 

రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను రియల్‌మీ అందించింది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.

రియల్‌మీ జీటీ 2 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999గా ఉంది. పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.4,999 విలువైన రియల్‌మీ వాచ్ ఎస్‌ను రూ.1కే పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.

రియల్‌మీ జీటీ 2 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల 2కే ఎల్టీపీవో 2.0 అమోఎల్ఈడీ సూపర్ రియాలిటీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను దీంట్లో లభించనుంది. రియల్‌మీ స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ మ్యాక్స్ సొల్యూషన్ కూడా ఇందులో అందించారు.

రియల్‌‌మీ జీటీ 2 ప్రో బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 65W సూపర్‌డార్ట్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 33 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుందని కంపెనీ అంటోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ (10 గిగా బైట్), 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.

Published at : 14 Apr 2022 06:54 PM (IST) Tags: Realme GT 2 Pro Realme GT 2 Pro Price Realme GT 2 Pro Price in India Realme GT 2 Pro Offers Realme GT 2 Pro Flipkart Sale Realme GT 2 Pro Sale

సంబంధిత కథనాలు

Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

Realme C30: రూ.10 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - లాంచ్ వచ్చే నెలలోనే?

Realme C30: రూ.10 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్ - లాంచ్ వచ్చే నెలలోనే?

Moto E32s: మోటొరోలా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.13 వేలలోపే!

Moto E32s: మోటొరోలా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.13 వేలలోపే!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

టాప్ స్టోరీస్

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

IAS Couple Dog :  ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ?   బదిలీ అయిన  ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!