By: ABP Desam | Updated at : 08 Dec 2022 06:53 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ 10 ప్రో 5జీ మనదేశంలో లాంచ్ అయింది.
రియల్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్ 10 ప్రో మనదేశంలో లాంచ్ అయింది. రూ.20 వేలలోపు ధరతో వచ్చిన ఈ ఫోన్‌లో వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. అయితే ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ23, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ, రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ఫోన్లతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
రియల్‌మీ 10 ప్రో 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.19,999గా నిర్ణయించారు. డార్క్ మేటర్, హైపర్ స్పేస్, నెబ్యులా బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 16వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
రియల్‌మీ 10 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ 10 ప్రో 5జీ పని చేయనుంది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. దీని సైడ్ బెజెల్స్ చాలా సన్నగా ఉండటం విశేషం.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను రియల్‌మీ అందించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W సూపర్‌వూక్ చార్జింగ్‌ను రియల్‌మీ 10 ప్రో 5జీ సపోర్ట్ చేయనుంది. 0 నుంచి 50 శాతం చార్జింగ్ కేవలం 20 నిమిషాల్లోనే ఎక్కనుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!
WhatsApp: మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, ఈ రోజు నుంచి ఇందులో వాట్సాప్ పని చేయదు!
Communities vs Groups: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్
Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!
Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam