అన్వేషించండి

Poco C40: ప్రపంచంలో మొదటిసారి ఆ ప్రాసెసర్‌తో స్మార్ట్ ఫోన్ - లాంచ్ చేసిన పోకో - ధర రూ.10 వేలలోపే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన సీ40 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో జేఎల్‌క్యూ జేఆర్510 ప్రాసెసర్‌ను అందించారు.

జేఎల్‌క్యూ జేఆర్510 ప్రాసెసర్‌తో పనిచేసే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్‌ను పోకో లాంచ్ చేసింది. అదే పోకో సీ40. ప్రపంచంలో ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. చైనాకు చెందిన జేవీ అనే కంపెనీ ఈ ప్రాసెసర్‌ను రూపొందించింది.

పోకో సీ40 ధర
ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే 150 డాలర్ల (సుమారు రూ.11,700) రేంజ్‌లో దీని ధర ఉండవచ్చని అంచనా. పవర్ బ్లాక్, కోరల్ గ్రీన్, పోకో ఎల్లో రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ అయితే రూ.10 వేలలోపు రేంజ్‌లోనే వచ్చే అవకాశం ఉంది.

పోకో సీ40 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఉన్న డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1560 పిక్సెల్స్‌గా ఉండగా... రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. జేఎల్‌క్యూ జేఆర్510 ఎంట్రీ లెవల్ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్ ఇదే.

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీఎన్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tech Greek (@tech_greeek)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?

వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
IPL 2026: ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
ఐపీఎల్‌లో పరుగుల వర్షం! బౌలర్లను చిత్తు చేసి అత్యధిక స్కోర్లు నమోదు చేసిన 5 మ్యాచ్‌లు ఇవే!
TVS Bikes 2026: టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
టీవీఎస్‌లో సామాన్యుడి బడ్జెట్ నుంచి రేసింగ్ ట్రాక్ వరకు అందుబాటులో ఉన్న మోడళ్లు, ధరల వివరాలు ఇవే?
Embed widget