అన్వేషించండి

Oppo Reno 8Z: ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఒప్పో కొత్త ఫోన్ - ధర ఎంతో చూశారా?

ఒప్పో రెనో సిరీస్‌లో కొత్త ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే ఒప్పో రెనో 8జెడ్.

ఒప్పో రెనో 8జెడ్ స్మార్ట్ ఫోన్ థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అందించారు. ఒప్పో గతంలో లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ల తరహాలోనే దీని డిజైన్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W సూపర్ వూక్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఒప్పో రెనో 8జెడ్ ధర
దీని ధరను 12,990 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా (సుమారు రూ.28,600) నిర్ణయించారు. ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. డాన్‌లైట్ గోల్డ్, స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఒప్పో రెనో 8జెడ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080×2400 పిక్సెల్స్‌గా ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 5 జీబీ పెంచుకోవచ్చు. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మోనో షూటర్, 2 మెగాపిక్సెల్ బొకే మాక్రో షూటర్లు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Embed widget