Oneplus Nord N30 SE: రూ.14 వేలలోపే వన్‌ప్లస్ 5జీ ఫోన్ - బ్రాండెడ్ ఫోన్ తక్కువలో కావాలంటే బెటర్ ఆప్షన్!
Oneplus Afforable Phone: వన్‌ప్లస్ తన చవకైన ఫోన్‌ని మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర భారతీయ కరెన్సీలో రూ.14 వేలలోపే ఉంది.
Oneplus New Phone: వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ (Oneplus Nord N30 SE) స్మార్ట్ ఫోన్ యూఏఈలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్తగా లాంచ్ అయిన ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ అందించారు. ఒక్క ర్యామ్ ఆప్షన్, రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.
వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ ధర (Oneplus Nord N30 SE Price)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 599 దిర్హామ్‌లుగా (భారతీయ కరెన్సీలో సుమారు రూ.13,600) నిర్ణయించారు. ఈ మోడల్ ఇప్పటికే వన్‌ప్లస్ గ్లోబల్ వెబ్‌సైట్లో లిస్ట్ అయింది. శాటిన్ బ్లాక్, సియాన్ స్పార్కిల్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.
వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Oneplus Nord N30 SE Features)
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. దీని పిక్సెల్ డెన్సిటీ 391 పీపీఐ, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను వన్‌ప్లస్ నార్డ్ ఎన్30 ఎస్ఈ సపోర్ట్ చేయనుంది. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే... ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీన్ని పవర్ బటన్‌లా కూడా ఉపయోగించవచ్చు. 5జీ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది. మరోవైపు వన్‌ప్లస్ 12కి సంబంధించిన సేల్ ఇటీవలే అమెజాన్‌లో ప్రారంభం అయింది. రూ.64,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!