OnePlus Nord 2T: వన్‌ప్లస్ కొత్త ఫోన్ ఎంట్రీ రేపే - సూపర్ ఫాస్ట్ చార్జింగ్, కేక పుట్టించే కెమెరాలు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ జులై 1వ తేదీన నార్డ్ 2టీని మనదేశంలో లాంచ్ చేయనుందని సమాచారం.
![OnePlus Nord 2T: వన్‌ప్లస్ కొత్త ఫోన్ ఎంట్రీ రేపే - సూపర్ ఫాస్ట్ చార్జింగ్, కేక పుట్టించే కెమెరాలు! OnePlus Nord 2T Tipped to Launch in India on July 1st Check Details OnePlus Nord 2T: వన్‌ప్లస్ కొత్త ఫోన్ ఎంట్రీ రేపే - సూపర్ ఫాస్ట్ చార్జింగ్, కేక పుట్టించే కెమెరాలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/e57ab67bd694ac2898452f493116dcc7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జులై 1వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. వన్‌ప్లస్ దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను ఇప్పటికే టీజ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే యూరోప్‌లో లాంచ్ అయింది. 80W ఫాస్ట్ చార్జింగ్, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో కంపెనీ అందించనుంది. ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.
దీంతోపాటు వన్‌ప్లస్ 10టీ హైరిజల్యూషన్ రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో వన్‌ప్లస్ 10 ప్రో తరహా డిజైన్ ఉండనుంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ వన్‌ప్లస్ నార్డ్ 2టీ పోస్టర్‌ను లీక్ చేశాడు. ఈ ఫోన్ జులై 1వ తేదీన లాంచ్ కానుందని ఇందులో పేర్కొన్నారు.
గతవారం మరో టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ కూడా ఈ ఫోన్ జులై 1వ తేదీనే లాంచ్ అవుతుందని తెలిపారు. దీని ధర మనదేశంలో రూ.28,999 నుంచి ప్రారంభం అవుతుందని కూడా ఈ లీక్‌లో తెలిపారు. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ ఫోన్ 80W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
దీంతోపాటు ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించనున్నారు. ఈ సెన్సార్‌కు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఫీచర్ కూడా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంలు వన్‌ప్లస్ నార్డ్ 2టీలో ఉండనున్నాయి.
దీంతోపాటు వన్‌ప్లస్ 10టీ హైరిజల్యూషన్ రెండర్లు కూడా లీకయ్యాయి. ఈ రెండర్లను బట్టి ఇందులో అలెర్ట్ స్లైడర్‌ను కంపెనీ అందించడం లేదని తెలుసుకోవచ్చు. దీని కెమెరా మాడ్యూల్ వన్‌ప్లస్ 10 ప్రో కంటే కాస్త డిఫరెంట్‌గా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)