By: ABP Desam | Updated at : 14 May 2022 09:02 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ మే 17వ తేదీన లాంచ్ కానుంది.
వన్‌ప్లస్ ఏస్ స్మార్ట్ ఫోన్ గత నెలలో చైనాలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ కొత్తగా ప్రారంభించిన ఏస్ సిరీస్‌లో మొదటి ఫోన్ ఇదే. ఇప్పుడు ఈ సిరీస్‌లో రెండో ఫోన్ లాంచ్‌కు సిద్ధం అవుతోంది. అదే వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్. ఈ ఫోన్ చైనాలో మే 17వ తేదీన లాంచ్ కానుంది.
దీంతోపాటు కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్‌ను కూడా రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై పనిచేయనుందని కూడా కంపెనీ ప్రకటించింది. అంటే ఇందులో 5జీ ఫీచర్ కూడా ఉండనుందన్న మాట.
వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు వస్తున్న అంచనాల ప్రకారం... వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్‌లో 6.59 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 2.85 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ కానుందని సమాచారం. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. గ్రే, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. అయితే కలర్ ఓఎస్ స్కిన్ ఉండనుందా లేకపోతే ఆక్సిజన్ ఓఎస్‌ను అందించనున్నారా తెలియరాలేదు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌ను ఇందులో కంపెనీ అందించనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో/డెప్త్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ మనదేశంలో మే 19వ తేదీన లాంచ్ కానుంది. దీని ధరను యూరోప్‌లో 399 యూరోలుగా (సుమారు రూ.32,100) నిర్ణయించారు. మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.25 వేలలోపే ఉండే అవకాశం ఉంది. బ్లాక్, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
Vivo X80 Pro: సూపర్ కెమెరాలతో వచ్చిన వివో ఫ్లాగ్ షిప్ ఫోన్లు - ఫీచర్లు మామూలుగా లేవుగా!
Realme Narzo 50 5G: రూ.14 వేలలోపే రియల్‌మీ 5జీ ఫోన్ - ఫీచర్లు అదుర్స్ - ఫోన్ ఎలా ఉందంటే?
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
COOKIES_POLICY