News
News
X

Android 13: నథింగ్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ - వచ్చేది ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ తన మొదటి స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను అందించనున్నట్లు ప్రకటించింది.

FOLLOW US: 

స్మార్ట్ ఫోన్ విభాగంలో లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన నథింగ్ తన మొదటి స్మార్ట్ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ను అందించనుంది. నథింగ్ ఫోన్ 1కు ఈ సంవత్సరం చివరికి ఆండ్రాయిడ్ 13 బీటా అప్‌డేట్ రానుందని కంపెనీ తెలిపింది. స్టేబుల్ అప్‌డేట్ రావడానికి మాత్రం 2023 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ విషయాన్ని నథింగ్ సీఈవో కార్ల్ పెయ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ‘ఆసక్తికరమైన, ఫన్ సాఫ్ట్ వేర్ ఎక్స్‌పీరియన్స్’ క్రియేట్ చేస్తున్నామని కార్ల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని కంపెనీ ఈ ఫోన్ లాంచ్ చేసినప్పుడు తెలిపింది.

నథింగ్ ఇప్పటి వరకు నాలుగు అప్‌డేట్స్ ఇచ్చింది. నథింగ్ ఓఎస్ 1.0.2 అప్‌డేట్ జులై 15వ తేదీన, నథింగ్ ఓఎస్ 1.1.0 అప్‌డేట్ జులై 20వ తేదీన, నథింగ్ ఓఎస్ 1.1.2 అప్‌డేట్ ఆగస్టు 3వ తేదీన, నథింగ్ ఓఎస్ 1.1.3 అప్‌డేట్ ఆగస్టు 23వ తేదీన వచ్చాయి.

నథింగ్ ఫోన్ (1) ధర
నథింగ్ ఫోన్ (1) ధరను కంపెనీ ఇటీవలే రూ.1,000 మేర పెంచింది. దీంతో 8 జీబీ ర్యామ్ +  128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999కు, 8 జీబీ ర్యామ్ +  256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999కు, 12 జీబీ ర్యామ్ +  256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999కు పెరిగాయి.

నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై నథింగ్ ఫోన్ 1 పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ‌ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ ఉండగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరా ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లు అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు నథింగ్ ఫోన్ 1లో ఉన్నాయి. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నట్లు నథింగ్ లాంచ్ సమయంలో ప్రకటించింది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 26 Aug 2022 06:01 PM (IST) Tags: Nothing Nothing Phone 1 Android 13 Nothing Phone 1 Android 13 Nothing Android 13

సంబంధిత కథనాలు

Itel Vision 3 Turbo: రూ.8 వేలలోపే ఐటెల్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా!

Itel Vision 3 Turbo: రూ.8 వేలలోపే ఐటెల్ కొత్త ఫోన్ - 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ కూడా!

వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది - 10ఆర్‌లోనే అదిరిపోయే కొత్త మోడల్!

వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది - 10ఆర్‌లోనే అదిరిపోయే కొత్త మోడల్!

Google Pixel 7 Pro Price: గూగుల్ కొత్త ఫోన్ల ధర లీక్ - ఈసారి ధర భారీగానే!

Google Pixel 7 Pro Price: గూగుల్ కొత్త ఫోన్ల ధర లీక్ - ఈసారి ధర భారీగానే!

Realme Narzo 50i Prime Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - అమెజాన్‌లో కొనేయచ్చు!

Realme Narzo 50i Prime Sale: రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ ప్రారంభం - అమెజాన్‌లో కొనేయచ్చు!

Tecno Pova Neo 5G: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Tecno Pova Neo 5G: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!