Nothing Phone 1: నథింగ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
జులై 12వ తేదీన లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ 1లో కంపెనీ చార్జర్‌ను అందించడం లేదని సమాచారం.
నథింగ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్‌తో పాటు చార్జర్‌ను కంపెనీ అందించడం లేదని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్యాకేజింగ్‌కు సంబంధించిన యూట్యూబ్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. జులై 12వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. దీని అంచనా ధర కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది.
ప్రముఖ రివ్యూయర్ గౌరవ్ చౌదరి దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రకారం ఫోన్ రిటైల్ బాక్స్ చాలా సన్నగా ఉంది. రీసైకిల్ చేసిన వెదురుతో దీన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. బాక్స్, బయట కానీ, లోపల కానీ అసలు ప్లాస్టిక్‌ను ఉపయోగించలేదని సమాచారం.
నథింగ్ ఫోన్ 1ను 100 శాతం రీసైకిల్ చేసిన అల్యూమినియం ఫ్రేమ్‌తో ఉపయోగిస్తున్నారు. ఇతర ఫ్లాగ్‌షిప్ హ్యాండ్ సెట్స్ సెట్ చేసిన స్టాండర్డ్స్‌ను అందుకునేందుకు నథింగ్ ఎంతో ప్రయత్నిస్తుందని దీన్ని బట్టి అర్థం అవుతోంది.
నథింగ్ ఫోన్ 1 ధర (అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్ ధర గతంలోనే ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ కథనాల ప్రకారం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 469.99 యూరోలుగా (సుమారు రూ.38,750) ఉండనుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 499.99 యూరోలుగానూ (సుమారు రూ.41,250), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 549.99 యూరోలుగానూ (సుమారు రూ.45,350) నిర్ణయించనున్నారని తెలుస్తోంది.
నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
నథింగ్ ఫోన్ 1 ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో అందించనున్నారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని సమాచారం. ఎల్ఈడీ నోటిఫికేషన్ సిస్టం కూడా ఫోన్ వెనకవైపు ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!