News
News
X

అత్యంత తక్కువ ధరకే నథింగ్ ఫోన్ 1 - ఎంతకు తగ్గించారంటే?

నథింగ్ ఫోన్ 1పై ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో భారీ ఆఫర్‌ను అందించనున్నారు.

FOLLOW US: 

నథింగ్ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ అందించారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.28,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.33,999 కాగా, ఏకంగా రూ.ఐదు వేల తగ్గింపును అందించడం విశేషం. ఈ సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి జరగనుంది.

దీంతోపాటు ఎన్నో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, ఇతర యాక్సెసరీలపై భారీ తగ్గింపు అందించనున్నారు. ఈ సేల్‌లో అందించే డీల్స్‌లో కొన్నిటినీ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించింది. ఏకంగా రూ.ఐదు వేల రేంజ్ నుంచే స్మార్ట్ ఫోన్లు ప్రారంభం కానున్నాయి.

నథింగ్ ఫోన్ (1) ధర
నథింగ్ ఫోన్ (1) ధరను కంపెనీ ఇటీవలే రూ.1,000 మేర పెంచింది. దీంతో 8 జీబీ ర్యామ్ +  128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999కు, 8 జీబీ ర్యామ్ +  256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999కు, 12 జీబీ ర్యామ్ +  256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999కు పెరిగాయి. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మాత్రం దీని ధర రూ.28,999 నుంచే ప్రారంభం కానుంది. అంటే మిగతా వేరియంట్ల ధర కూడా తగ్గుతుందన్న మాట.

నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ‌ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 

12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఫీచర్లు అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ ఉండగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరా ఉంది.

డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు నథింగ్ ఫోన్ 1లో ఉన్నాయి. ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అందించనున్నట్లు నథింగ్ లాంచ్ సమయంలో ప్రకటించింది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

Published at : 12 Sep 2022 12:22 AM (IST) Tags: Flipkart Big Billion Days Flipkart Big Billion Days Sale Nothing Phone 1 Nothing Phone 1 Offer Flipkart Big Billion Days Offers

సంబంధిత కథనాలు

Huawei Nova 10 SE: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హువావే కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Huawei Nova 10 SE: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హువావే కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఫస్ట్ డే కలెక్షన్ రూ.1,000 కోట్లు - ఆఫర్ సేల్స్‌లో శాంసంగ్ బ్లాక్‌బస్టర్!

ఫస్ట్ డే కలెక్షన్ రూ.1,000 కోట్లు - ఆఫర్ సేల్స్‌లో శాంసంగ్ బ్లాక్‌బస్టర్!

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

Amazon Sale: రూ.ఐదు వేలలోనే రెడ్‌మీ కొత్త ఫోన్ - అమెజాన్ సూపర్ ఆఫర్!

Tecno Pova Neo 2: 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఫోన్ - రూ.14 వేలలోపే!

Tecno Pova Neo 2: 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఫోన్ - రూ.14 వేలలోపే!

టాప్ స్టోరీస్

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

Supreme Court on EWS Quota: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తీర్పును 'రిజర్వ్' చేసిన సుప్రీం కోర్టు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి