By: ABP Desam | Updated at : 14 May 2022 08:43 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మోటో జీ82 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.
మోటొరోలా తన కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ను కొన్ని మార్కెట్లలో లాంచ్ చేసింది. అదే మోటో జీ82 5జీ. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను అందించారు. ఐపీ52 వాటర్ రెసిస్టెంట్ బిల్డ్‌తో ఈ ఫోన్‌ను కంపెనీ రూపొందించింది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
మోటో జీ82 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను 329.99 యూరోలుగా (సుమారు రూ.26,500) నిర్ణయించారు. యూరోప్, లాటిన్ అమెరికా, ఆసియా వంటి ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. దీన్ని బట్టి త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుందని అంచనా వేయవచ్చు. వైట్, గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
మోటో జీ82 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... పిక్సెల్ పర్ ఇంచ్ కౌంట్ 402గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 88 శాతంగా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W టర్బోచార్జ్‌డ్ సపోర్ట్‌ను ఇందులో అందించారు. 5జీ, జీపీఎస్, వైఫై 5, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. డాల్బీ అట్మాస్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంలను కూడా కంపెనీ మోటో జీ82 5జీలో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!
Vivo X80 Pro: సూపర్ కెమెరాలతో వచ్చిన వివో ఫ్లాగ్ షిప్ ఫోన్లు - ఫీచర్లు మామూలుగా లేవుగా!
Realme Narzo 50 5G: రూ.14 వేలలోపే రియల్మీ 5జీ ఫోన్ - ఫీచర్లు అదుర్స్ - ఫోన్ ఎలా ఉందంటే?
Google Pixel 6A Price: గూగుల్ పిక్సెల్ ధరలను ప్రకటించిన కంపెనీ - ఏ దేశంలో తక్కువకు కొనచ్చంటే?
Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
TRS Rajyasabha Candidates: ఖమ్మంపై సీఎం కేసీఆర్ కన్ను - రెండు రాజ్యసభ స్థానాలు లాభం చేకూర్చేనా ?