అన్వేషించండి

Lava Blaze 2 5G: రూ.10 వేలలోపే 5జీ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అదే లావా బ్లేజ్ 2 5జీ.

లావా బ్లేజ్ 2 5జీ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన లావా బ్లేజ్ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.56 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

లావా బ్లేజ్ 2 5జీ ధర, ఫీచర్లు
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో లావా బ్లేజ్ 2 5జీని కొనుగోలు చేయవచ్చు. లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా స్టోర్లలో నవంబర్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

లావా బ్లేజ్ 2 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై లావా బ్లేజ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను కూడా అందిస్తామని కంపెనీ అంటోంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. పంచ్ హోల్ కటౌట్ ఉన్న 2.5డీ కర్వ్‌డ్ స్క్రీన్ ఉంది. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్ అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌లో ఉంది. దీన్ని వర్చువల్‌గా 12 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 0.08 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. 1 టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది.

5జీ, 4జీ, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, వైఫై, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ ఫీచర్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 203 గ్రాములుగా ఉంది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటుడు నాగార్జున, అసలేం జరిగిందంటే!
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget