iQoo Z6 SE: ఐకూ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేస్తుంది - ధర రూ.20 వేలలోపే!
ఐకూ జెడ్6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఐకూ జెడ్6 సిరీస్ మనదేశంలో మోస్ట్ పాపులర్ సిరీస్‌లో ఒకటి. ఇప్పుడు ఈ సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఐకూ జెడ్6 సిరీస్‌లో కొత్త ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. అదే ఐకూ జెడ్6 ఎస్ఈ. ఇది 4జీ ఫోనా లేకపోతే 5జీ ఫోనా అన్నది తెలియరాలేదు.
ఇప్పటివరకు వచ్చిన కథనాల ప్రకారం ఈ ఫోన్ కంపెనీ ఇండియా వెబ్‌సైట్లో కూడా కనిపించింది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుంతో తెలియరాలేదు. ఈ నెలాఖరులో లేదా ఆగస్టు ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఎస్ఈ అంటే స్పీడ్ ఎడిషన్ అని అర్థం.
ఐకూ జెడ్6కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇందులో ప్రో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్లు ఇంతవరకు ఏ సర్టిఫికేషన్ వెబ్ సైట్‌లోనూ కనిపించలేదు. వీటి ధర కూడా రూ.20 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
ఐకూ 10 సిరీస్ ఫోన్లు కూడా మనదేశంలో లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల లాంచ్‌ను కంపెనీ టీజ్ చేసింది. జులై 19వ తేదీన ఐకూ 10 సిరీస్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. మనదేశ కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ఈ లాంచ్ కార్యక్రమం.
ఐకూ 10 సిరీస్ ఫోన్లలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనునట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఐకూ కన్పర్మ్ చేసింది. ఐకూ దీనికి సంబంధించిన పోస్టర్‌ను వీబోలో షేర్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుందని ఈ పోస్టర్‌లోనే కన్ఫర్మ్ చేశారు.
ఈ సిరీస్‌లో ఐకూ 10, ఐకూ 10 ప్రో రెండు ఫోన్లు ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం... వీటిలో ఒక ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉండనుంది. ఇది ఐకూ 10 ప్రో మోడలా? లేకపోతే ఐకూ 10 స్మార్ట్ ఫోనా? అన్నది మాత్రం తెలియలేదు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram