By: ABP Desam | Updated at : 26 Jun 2022 09:54 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐకూ యూ5ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.
ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. అదే ఐకూ యూ5ఈ. ఈ ఫోన్ వివో చైనా అధికారిక స్టోర్‌లోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ తరహా నాచ్ కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఐకూ యూ5ఈ ధర
ఈ ఫోన్ వివో చైనా అధికారిక స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా (సుమారు రూ.16,000) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా (సుమారు రూ.18,000) ఉంది. డార్క్ బ్లాక్, సిల్వర్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఐకూ యూ5ఈ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.51 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ హెచ్‌డీ+ కాగా... రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 5జీని కూడా సపోర్ట్ చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఓషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 193 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Motorola Edge 30 Fusion: మనదేశంలో మోటొరోలా కొత్త ఫోన్ - లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంతో!
Samsung Galaxy A04 Core: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్ - కీలక వివరాలు లీక్!
మొట్టమొదటిసారి అలాంటి ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్ - ఇక శాంసంగ్‌కు కష్టమే!
Asus Zenfone 9: యాపిల్ తరహాలో అసుస్ లేటెస్ట్ ఫోన్ - 16 జీబీ వరకు ర్యామ్!
50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 జీబీ ర్యామ్ - ధర మాత్రం రూ.10 వేలలోపే!
Rakesh Jhunjhunwala: మరణించాక, తొలి ట్రేడింగ్ సెషన్లో ఝున్‌ఝున్‌వాలా షేర్లు ఎలా ఉన్నాయంటే?
Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు
Khammam Politics: ఖమ్మంలో మళ్లీ మొదలైన హత్యా రాజకీయాలు - తెల్దారుపల్లి ఎందుకంత కీలకం !
Amitabh Chaudhry Passes Away: అమితాబ్ చౌదరి కన్నుమూత - బీసీసీఐ సహా క్రికెటర్ల దిగ్భ్రాంతి!