అన్వేషించండి

Infinix 180W Thunder Charge: నాలుగు నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఫుల్ - దేశంలోనే అత్యంత వేగమైన ఫాస్ట్ చార్జింగ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ 180W థండర్ చార్జ్ టెక్నాలజీని రివీల్ చేసింది.

ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రివీల్ చేసింది. ఏకంగా 180W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లాంచ్ కానున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఈ టెక్నాలజీని సపోర్ట్ చేయనున్నాయి. ఈ టెక్నాలజీ ద్వారా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం నాలుగు నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కనుందని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం మనదేశంలో వన్‌ప్లస్ 10ఆర్ 5జీ, రియల్‌మీ జీటీ నియో 3ల్లో 150W ఫాస్ట్ చార్జింగ్ అందుబాటులో ఉంది. ఇన్‌ఫీనిక్స్ తీసుకురానున్న 180W ఫాస్ట్ చార్జింగ్ మనదేశంలో అత్యంత వేగమైన ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కానుంది.

ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో చవకైన ల్యాప్‌టాప్‌ను కూడా లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐ3 + 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990గానూ, ఐ3 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,990గానూ ఉంది.

ఐ5 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,990గానూ, ఐ5 + 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,990గా నిర్ణయించారు. గ్రే, బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ల్యాప్‌టాప్ కొంటే మరో రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్‌గా ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 16:9 కాగా, 10వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌లను ఇన్‌ఫీనిక్స్ ఈ ల్యాప్‌టాప్‌లో అందించింది.

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఇందులో 50 డబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 11 గంటల బ్రౌజింగ్, 11 గంటల వెబ్ బ్రౌజింగ్, 9 గంటల రెగ్యులర్ వర్క్, 9 గంటల వీడియో ప్లేబ్యాక్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 90 నిమిషాల సమయం పట్టనుందని కంపెనీ తెలిపింది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget