By: ABP Desam | Updated at : 27 Jul 2022 03:07 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
హానర్ ఎక్స్8 5జీ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకువచ్చింది.
హానర్ ఎక్స్8 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, 40W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
హానర్ ఎక్స్8 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మిడ్‌నైట బ్లాక్, ఓషన్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.
హానర్ ఎక్స్8 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ ఫీచర్ కూడా ఉన్నాయి. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మ్యాజిక్ యూఐ 402 ఆపరేటింగ్ సిస్టంపై హానర్ ఎక్స్8 5జీ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, బైదు, గ్లోనాస్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
Oppo Reno 8Z: ఫుల్ హెచ్‌డీ డిస్ప్లేతో ఒప్పో కొత్త ఫోన్ - ధర ఎంతో చూశారా?
Realme 9i 5G: రియల్మీ చవకైన 5జీ ఫోన్ - ఈ నెలలోనే లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఈ శాంసంగ్ ఫోన్‌పై భారీ తగ్గింపు - 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.13 వేలలోపే!
Nokia 110 2022: రూ.2 వేలలోపే నోకియా కొత్త ఫోన్ - సెకండరీ ఫోన్‌గా వాడుకోవచ్చు!
Moto G32: త్వరలో లాంచ్ కానున్న మోటొరోలా బడ్జెట్ ఫోన్ - ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే?
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!
Rabindranath Tagore: ఐన్‌స్టీన్, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?