Google Pixel 7 Price: గూగుల్ కొత్త ఫోన్ రేట్ లీక్ - ఈసారి యాపిల్ రేంజ్‌లో!
గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో, మొట్టమొదటి పిక్సెల్ వాచ్‌లను కంపెనీ అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందు ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు భారతదేశంలో కూడా లాంచ్ అవుతాయని టెక్ దిగ్గజం ప్రకటించింది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ రాబోయే గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్పెసిఫికేషన్ షీట్‌ను షేర్ చేశారు. ఇండియా లాంచ్ తేదీని గూగుల్ ఇంకా ప్రకటించలేదు, అయితే మనదేశంలో కూడా అక్టోబర్ 7వ తేదీనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Google Pixel 7 Pro స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు (అంచనా)
టిప్‌స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన షీట్ ప్రకారం గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో QHD+ రిజల్యూషన్ ఉన్న 6.7-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. LTPOని సపోర్ట్ చేస్తుంది. Google Tensor G2 చిప్‌సెట్‌పై పని చేస్తుందని సమాచారం. ఇది గరిష్టంగా 12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందించవచ్చని భావిస్తున్నారు. పిక్సెల్ 7 ప్రో ఆండ్రాయిడ్ 13పై రన్ అయ్యే అవకాశం ఉంది.
ఫోటోగ్రఫీ కోసం, ఫోన్ వెనకవైపు 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 48MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందింస్తారని అంచనా. సెల్ఫీలు మరియు వీడియోల కోసం 11MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండవచ్చు.
గూగుల్ పిక్సెల్ 7 ప్రో 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5,000 mAh బ్యాటరీతో రానుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుందని భావిస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో అబ్సిడియన్, హాజెల్, స్నో కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని గూగుల్ ధృవీకరించింది.
గూగుల్ పిక్సెల్ 7 ప్రో అంచనా ధర
గతంలో వచ్చిన కథనాల ప్రకారం, గూగుల్ పిక్సెల్ 7 ధర 599 డాలర్ల (సుమారు రూ. 48,500) నుంచి, గూగుల్ పిక్సెల్ 7 ప్రో ధర 899 డాలర్ల (సుమారు రూ. 73,000) నుంచి ప్రారంభం కావచ్చు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram