By: ABP Desam | Updated at : 12 May 2022 06:22 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. (Image Credits: Google)
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ తన గూగుల్ ఐ/వో సదస్సులో ప్రకటించింది. గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ ఇదే. ఇందులో ఇన్ హౌస్ టెన్సార్ ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌లను అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, ముందువైపు ఒక కెమెరా అందించారు. వీటికి ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని గూగుల్ హామీ ఇచ్చింది.
గూగుల్ పిక్సెల్ 6ఏ ధర
దీని ధరను 449 డాలర్లుగా (సుమారు రూ.34,800) నిర్ణయించారు. చాక్, చార్‌కోల్, సేజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు అమెరికాలో జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. గూగుల్ పిక్సెల్ 6ఏ మనదేశంలో కూడా లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఎప్పుడు రానుందో మాత్రం తెలియరాలేదు.
గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.1 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ గూగుల్ టెన్సార్ చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్లను గూగుల్ అందించింది.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12.2 మెగాపిక్సెల్ కాగా... 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4410 ఎంఏహెచ్ కాగా... ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Oppo A57 2022: రూ.13 వేలలోపే ఒప్పో కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
Realme C30: రూ.10 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్ - లాంచ్ వచ్చే నెలలోనే?
Moto E32s: మోటొరోలా కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది - ధర రూ.13 వేలలోపే!
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Gold Rate Today 28th May 2022: పసిడి ప్రియులకు షాక్ - నేడు పెరిగిన బంగారం ధర, రూ.600 ఎగబాకిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్కు రాజస్తాన్!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం