By: ABP Desam | Updated at : 26 Jul 2022 02:36 PM (IST)
సెల్ ఫోన్‌లో డ్రోన్ కెమెరా
Vivo Drone Camera : సెల్‌ఫోన్లు ఇలా మార్కెట్లోకి వచ్చాయో లేదో అలా వేగంగా మారిపోతున్నాయి. ఫీచర్ ఫోన్ల దగ్గర్నుంచి సూపర్ స్మార్ట్ పోన్ల వరకూ రకరకాలుగా రూపాంతరం చెందింది. ఫోన్లలో కెమెరాలు కూడా అంతే. ఇప్పుడు సెల్ ఫోన్ తో సినిమాలు కూడా తీస్తున్నారు. ఈ కెమెరా ఫోన్లలో మరో విప్లవం తీసుకొస్తోంది వివో సంస్థ. ఏకంగా సెల్ ఫోన్ కెమెరాలో డ్రోన్ కెమెరా పెట్టేస్తోంది. దీనికి సంబందించి డిజైన్.. టెస్టింగ్ కూడా పూర్తయింది. కాన్సెప్ట్ వీడియోను కూడా రిలీజ్ చేసింది.
The camera in this concept phone from Vivo is placed on top of the drone; this makes it very easy to take selfies or zoom in…
pic.twitter.com/74rPtT9bZl— Tansu YEĞEN (@TansuYegen) July 25, 2022
టాప్ యాంగిల్ నుంచి ఫోటో తీసుకోవాలన్నా.. సెల్ఫీ తీసుకోవాలన్నా ఇక సెల్ఫీ స్టిక్ అవసరం ఉండదు. ఈ ఫోన్ డ్రోన్ కెమెరానే పైకి వెళ్లి షూటింగ్ చేస్తుంది. దానికి తగ్గట్లుగా ఫోన్‌లోనే సెట్టింగ్ పెట్టుకోవచ్చు. డ్రోన్ కెమెరా అంటే.. ఫోన్ మొత్తం పైకి ఎగరదు. కేవలం కెమెరా మాత్రే పైకి వెళ్తుంది. దానికి సంబంధించిన వివో విడుదల చేసిన ఫోన్ కాన్సెప్ట్ కూడా ఆకట్టుకుంటోంది. వివో ఫోన్‌లో అంతర్బాగంగా ఉండే.. చిన్న డ్రోన్ కెమెరాలకు నాలుగు ఫ్యానలు ఉన్నాయి. మనం డ్రోన్ కెమెరా మోడ్‌లోకి వెళ్లి ఆన్ చేయగానే ఆటోమేటిక్‌గా కెమెరా బయటకు వచ్చి.. మనం ఇచ్చిన కమాండ్‌లో ఫోటోలు తీస్తుంది.
ఇందులో రెండు వందల మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. అరు వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫోన్ల కన్నా అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. అయితే ఈ ఫోన్‌ను ఎప్పుడు ఇండియాలో మార్కెట్లోకి విడుదల చేస్తారో ఇంకా వివో స్పష్టం చేయలేదు. కానీ ఆ ఫోన్‌కు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కల్తీ మద్యం తాగి 21 మంది మృతి- 40 మంది పరిస్థితి విషమం!
వివో సంస్థ ఫ్లాగ్ షిప్ ఫోన్లను తయారుచేయడంలో ముందు ఉంది. ఈ డ్రోన్ ఫోన్లలో ఇదే మొదటిది. ఇతరకంపెనీలు మరింత అడ్వాన్స్‌గా పరిశోధనలు చేసి.. ఫోన్లలో సరికొత్త విప్లవాన్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే... ముందు ముందు పెద్ద్ద పెద్ద డ్రోన్ కెమెరాల వ్యాపారాన్ని కూడా ఈ డ్రోన్ కెమెరా ఫోన్లే మింగేసే సూచనలు కనిపిస్తున్నాయి.
iPhone 14: ఐఫోన్ 14 విషయంలో అవి రూమర్లే - వెలుగులోకి కొత్త వివరాలు!
రూ.13 వేలలోపే మోటో కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?
64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!
రూ.20 వేలలో వివో కొత్త 5జీ ఫోన్ - భారీ బ్యాటరీ, రెండు కెమెరాలతో!
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!