అన్వేషించండి

Shirtless AI Summit protest: ఏఐ సమ్మిట్ లో నిరసన.. ఐవైసీ అధ్యక్షుడు ఉదయ భానును అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

Shirtless AI Summit protest: ఢిల్లీలోని భారత మండపంలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ లో నిరసన తెలిపిన కేసులో యూత్ కాంగ్రెస్ లీడర్ ఉదయ్ భాను చిబ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూఢిల్లీ: ఏఐ సమ్మిట్‌లో నిరసన తెలిపిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం భారత్ మండపంలో జరిగిన 'India AI Impact Summit' సందర్భంగా చొక్కాలు విప్పి నిరసన కేసులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో యూత్ కాంగ్రెస్ లీడర్ ఉదయ్ భానును అదుపులోకి తీసుకుని, అనంతరం ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు.

7 రోజుల రిమాండ్ కోరిన పోలీసులు

 అంతర్జాతీయ వేదికపై చొక్కా విప్పి నిరసన తెలుపి గందరగోళం సృష్టించిన ఉదయ్ భానును కోర్టులో ప్రవేశపెట్టిన ఢిల్లీ పోలీసులు 7 రోజుల కస్టడీని కోరారు. ఈ నిరసన వెనుక కుట్ర కోణం దాగి ఉందని, ఉదయ్ ప్రధాన పాత్ర పోషించారని, నిరసనకారులకు సదుపాయాలు కల్పించారని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి పాల్గొన్నారని, విచారణ నిమిత్తం నిందితుడిని పలు ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉన్నందున వారం రోజుల కస్టడీ అవసరమని కోర్టుకు వివరించారు.

అయితే ఉదయ్ భాను తరపు లాయర్ పోలీసు కస్టడీని తీవ్రంగా వ్యతిరేకించారు. తన క్లయింట్ ఎల్లప్పుడూ విచారణకు సహకరించారని, పిలిచినప్పుడల్లా విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు. కేవలం టీ-షర్టులను రికవరీ చేయడానికి కస్టడీ కోరడం హాస్యాస్పదమని కోర్టుకు తెలిపారు. 

పోలీస్ స్టేషన్‌కు పిలిచి అరెస్ట్ చేశారా ?

విచారణ నిమిత్తం ఉదయ్ భాను చిబ్‌ను తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు, సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉదయ్ భాను వద్ద ఉందని లేదా ఈ నిరసనలో IYC ప్రెసిడెంట్ కీలక పాత్ర పోషించారని పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో ఉదయ్ తమకు పూర్తి స్థాయిలో సహకరించలేదని, చాలా ప్రశ్నలను దాటవేయడం లేదా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉదయ్ భానుకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించిన తర్వాతే అరెస్ట్ చేసినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.

పోలీసులు అడిగిన ప్రశ్నలు (వర్గాల సమాచారం ప్రకారం):

  • AI సమ్మిట్‌లో జరిగిన నిరసనపై మీకు ముందుగానే తెలుసా?

  • మీ ఆదేశాల మేరకే సమ్మిట్‌లో ఈ నిరసన జరిగిందా?

  • ఈ నిరసనలో ఎవరెవరు పాల్గొన్నారు?

  • నిరసనలో పాల్గొనడానికి కార్యకర్తలను ఏయే ప్రాంతాల నుంచి రప్పించారు ?

  • కార్యకర్తలు ఢిల్లీకి రావడానికి సౌకర్యాలు ఎలా కల్పించారు?

  • నిరసన కోసం అవసరమైన సామగ్రిని ఎక్కడి నుంచి, ఎలా సేకరించారు?

  • లాజిస్టికల్ సపోర్ట్ ఎక్కడి నుంచి, ఎవరి వద్ద లభించింది?

షర్ట్‌లెస్ నిరసనలో మొత్తం 8 అరెస్టులు

 AI సమ్మిట్ సమయంలో IYC కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు, AI సంబంధిత సమస్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేదిక వద్ద రచ్చ చేశారు. దీనిపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు పోలీసులు కేసు నమోదు చేసి.. ఉదయ్ భాను చిబ్‌తో కలిపి ఇప్పటివరకు మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు.

ప్రభుత్వం వీటిపై ఎందుకు స్పందించడం లేదు

 కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ.. యువత నిరుద్యోగం, పేపర్ లీక్ వంటి సమస్యలతో సతమతమవుతున్నా కేంద్రం నుంచి సమాధానం రావడం లేదు. అందుకే AI సమ్మిట్‌లో నిరసన తెలపాల్సి వచ్చింది. ఎంపీలుగా మేము ఈ అంశాలను పార్లమెంటులో లేవనెత్తినా ఫలితం లేదు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆశలు కోల్పోయిన యువత ఈ నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగం నుంచి వచ్చిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో ధైర్యవంతులు అని అన్నారు.

కుట్ర కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు

 ఢిల్లీ పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఏఐ సమ్మిట్ లో షర్ట్ లెస్ నిరసన వెనుక కుట్ర ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ నిరసన వెనుక వ్యవస్థీకృత ప్రణాళిక ఉందని, ఇందులో యువజన కాంగ్రెస్ అగ్రనేతలు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ నేత ఉదయ్ భాను చిబ్‌ను తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Embed widget