Virosh Wedding : వెడ్డింగ్ ఆఫ్ విరోష్ సెలబ్రేషన్స్ - ఫోటోలు షేర్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక
Vijay Deverakonda Rashmika : విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విరోష్ కపుల్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Celebrations : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నెల 26న రాజస్థాన్ ఉదయపూర్‌లోని 'మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ఏకాయా' వేదికగా వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు, సన్నిహితులు ఉదయపూర్ చేరుకున్నారు.
ఫోటోలు షేర్ చేసిన విరోష్ కపుల్
తాజాగా, విజయ్, రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. విజయ్ స్విమ్మింగ్ పూల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా... డైనింగ్ టేబుల్‌పై గ్రీన్ థీమ్‌తో ఉన్న డిన్నర్ ఫోటోను రష్మిక షేర్ చేశారు. దీనిపై విరోష్ అని రాసి ఉంది. అతిథులకు సంప్రదాయ వంటకాలతో పాటు ప్రపంచ స్థాయి బెస్ట్ రుచులను వడ్డించనున్నారు.
ఈ రోజు నుంచే పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సంగీత్, మెహందీ వేడుకతో పాటు హల్దీ వేడుకలు అంతా సిద్ధం కాగా... బుధవారం హల్దీ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. దాదాపు 100 మంది విరోష్ పెళ్లి వేడుకకు హాజరు కానున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
Ohhh goddd are we dreaming???? them dropping the glimpse of their post wedding moments😭💗
— | The Wedding of ViRosh | (@_aditieee_) February 23, 2026
Always expect the unexpected from #virosh 🧿🫶🏻 pic.twitter.com/fkPrwvv2Th
Also Read : 'పెద్ది' రెండో సాంగ్ రెడీ? - 'చికిరి చికిరి' ట్రెండ్‌ను దాటేస్తుందా?
























