Republic Day Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌పై 10వేలు, శాంసంగ్‌పై 50 వేల వరకు తగ్గింపు- జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే రిపబ్లిక్ డే సేల్‌లో భారీ ఆఫర్స్!
Republic Day Sale: ఐఫోన్ 17 కొనాలనుకునేవారికి శుభవార్త. ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే రిపబ్లిక్ డే సేల్‌లో భారీ ఆఫర్ ప్రకటించారు.

Republic Day Sale: కొత్త iPhone 17 కొనాలనుకుంటే మాత్రం వారం రోజులు ఆగితే మంచిది. భారీ డిస్కౌంట్ వస్తుంది. దీని వల్ల మీరు కొంత డబ్బులను ఆదా చేసుకోగలరు. వాస్తవానికి, Flipkartలో రిపబ్లిక్‌డే సందర్భంగా సేల్ రాబోతోంది, ఇందులో ఈ iPhoneపై భారీ తగ్గింపు లభిస్తుంది. జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్‌లో iPhone 17 కొనుగోలుపై వేల రూపాయలు ఆదా డిస్కౌంట్ ఇస్తున్నారు. చాలా కంపెనీల ఫోన్‌లు రేటు పెంచాలని చూస్తున్న టైంలో తగ్గింపు ధరకు ఐఫోన్ వస్తుంది అంటే మాత్రం కచ్చితంగా జాక్‌పాటే అని చెప్పవచ్చు.
iPhone 17 స్పెసిఫికేషన్స్
iPhone 17 అనేక అద్భుతమైన అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ప్రో మోడల్స్‌లాగే, iPhone 17 కూడా ప్రోమోషన్ టెక్నాలజీతో 6.3-అంగుళాల ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అల్యూమినియం, గ్లాస్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. 7.3mm మందంతో వస్తోంది. ఈ iPhone 48MP+12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఫ్రంట్‌లో సెంటర్ స్టేజ్ లెన్స్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. Apple తాజా A19 చిప్‌తో ఈ ఫోన్ 8GB RAMతో డిజైన్ చేశారు. iPhone 16తో పోలిస్తే ఇందులో మన్నికైన పెద్ద బ్యాటరీ ఉందని కూడా కంపెనీ ప్రకటించింది. మంచి ఫీచర్స్ ఉన్నందున ఈ ఫోన్ కోసం కోసం జనాలు క్యూ కట్టారు. దీంతో iPhone ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్ముడైంది.
Flipkartలో డీల్ లభిస్తుంది
జనవరి 17 నుంచి Flipkartలో రిపబ్లిక్‌డే సేల్ ప్రారంభమవుతోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ సేల్‌లో iPhone 17 రూ. 74,999కి లభిస్తుంది, అయితే దీని అసలు ధర రూ. 82,999. ఈ విధంగా, కస్టమర్‌లు నేరుగా రూ. 8,000 ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ గురించిన మిగిలిన సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. సాధారణంగా కంపెనీ ఇచ్చే ఆఫర్‌తోపాటు బ్యాంకుల ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ వస్తాయి. పాత ఫోన్‌పై కూడా ఆఫర్స్ ఇస్తారు. ఇలాంటి ఆఫర్స్ కూడా ఉంటే ఈ ఐఫోన్ కాస్ట్ మరింత తగ్గే ఛాన్స్ లేకపోలేదు.
Galaxy S24 Ultra 5Gపై కూడా తగ్గింపును పొందండి
Galaxy S24 Ultra 5Gపై కూడా ప్రస్తుతం అద్భుతమైన తగ్గింపు లభిస్తోంది. భారతదేశంలో ఈ ఫోన్ రూ. 1,29,999 ధరపై అమ్మకాలు ప్రారంభించారు. అయితే Flipkartలో ప్రస్తుతం దీని టైటానియం ఎల్లో వేరియంట్ కేవలం రూ. 86,500కి లిస్ట్ చేసి ఉంది. అంటే దాదాపుగా 50వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఈ ప్రీమియం ఫోన్‌ను ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా మీరు భారీగా ఆదా చేసుకోవచ్చు.





















