News
News
X

Asus Zenfone 9: కేక పెట్టించే ఫీచర్లతో అసుస్ కొత్త ఫోన్ - కానీ సైజు మాత్రం!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది.

FOLLOW US: 

అసుస్ జెన్‌ఫోన్ 9 స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. యూరోపియన్ మార్కెట్లలో ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయింది. యాపిల్ తరహా చిన్న సైజులో ఆకట్టుకునే డిజైన్‌తో అసుస్ జెన్‌ఫోన్ 9 ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్‌లో హోల్ పంచ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఉన్నాయి.

అసుస్ జెన్‌ఫోన్ 9 ధర (అంచనా)
యూరోప్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర 799 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.64,800) నుంచి ప్రారంభం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రేటు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. మనదేశంలో దీని ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌లైట్ వైట్, సన్‌సెట్ రెడ్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

అసుస్ జెన్‌ఫోన్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
ఈ ఫోన్ యూరోపియన్ వెర్షన్ ఫీచర్లు మనదేశ వెర్షన్లో కూడా ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై అసుస్ జెన్‌ఫోన్ 9 పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120 హెర్ట్జ్ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1100 నిట్స్‌గా ఉంది. హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్‌లో అందించారు.

16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అసుస్ జెన్‌ఫోన్ 9లో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. అడ్రెనో 730 జీపీయూని కూడా ఈ ప్రాసెసర్‌కు ఇంటిగ్రేట్ చేయడం విశేషం.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సిక్స్-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, నావిక్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 18.5 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను, 8 గంటల గేమింగ్ టైంను ఇది అందించనుంది. డ్యూయల్ మైక్రో ఫోన్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 169 గ్రాములుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 26 Aug 2022 12:07 AM (IST) Tags: Asus New Phone Asus Zenfone 9 India Launch Asus Zenfone 9 Asus Zenfone 9 Features Asus Zenfone 9 Specifications Asus Zenfone 9 Expected Price

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!