Asus ROG Phone 6: అసుస్ కొత్త గేమింగ్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - సూపర్ ఫీచర్లు!
అసుస్ రోగ్ ఫోన్ 6 సిరీస్ జులై 6వ తేదీన లాంచ్ కానుంది.
అసుస్ తన రోగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అసుస్ రోగ్ ఫోన్ 6 సిరీస్ ఫోన్లు జులై 6వ తేదీన లాంచ్ కానున్నాయి. వర్చువల్ లాంచ్ ఈవెంట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్లను కంపెనీ లాంచ్ చేయనుంది. కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో దీన్ని స్ట్రీమ్ చేయనున్నారు.
ఈ విషయాన్ని అసుస్ టీజర్ పోస్టర్ ద్వారా టీజ్ చేసింది. దీనికి సంబంధించి వర్చువల్ ఈవెంట్ తైవాన్‌లోని తైపేలో జరగనుంది. వారి టైమ్ జోన్ల ప్రకారం ఈ ఈవెంట్‌ను లైవ్ చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు.
అసుస్ రోగ్ సిరీస్ ఫోన్లను గేమింగ్ కోసమే ప్రధానంగా రూపొందిస్తారు. ఈ ఫోన్ యువతే లక్ష్యంగా లాంచ్ కానుంది. అసుస్ రోగ్ ఫోన్ 6 లాంచ్ ఈవెంట్లో కొత్త యాక్సెసరీలు, న్యూ గేమింగ్ హెడ్ ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫీచర్లు ప్రస్తుతానికి తెలియరాలేదు. అయితే క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇది మాత్రం అధికారికంగానే ప్రకటించారు.
అసుస్ ఇటీవలే రెండు కొత్త వివోబుక్ ల్యాప్‌టాప్‌లను మనదేశంలో లాంచ్ చేసింది. అవే జెన్‌బుక్ 14ఎక్స్ ఓఎల్ఈడీ స్పేస్ ఎడిషన్, జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌లు. జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీలో 14 అంగుళాల 2.8కే ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram