iPhone SE 4 : ఐఫోన్ SE 4 లీక్స్.. ఊహించని అప్‌గ్రేడ్‌తో వచ్చేసిన ఐఫోన్ SE 4, ధర ఎంత ఉండొచ్చంటే
iPhone SE 4 Leaks : ఏప్రిల్‌లో యాపిల్ నుంచి విడుదల కానున్న iPhone SE 4 లీక్స్ వచ్చేశాయి. మరి దీనిలో ఫీచర్లేమి ఉన్నాయి? ధర ఎంత వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Apple iPhone SE 4 Leak : యాపిల్ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి iPhone SE 4ని విడుదల చేయనుంది. అయితే ఈలోపే SE 4 లీక్స్ సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. Tipster Evan Blass (@evleaks) ఐఫోన్ SE 4 సోర్స్ కోడ్ చిత్రాన్ని 'X'లో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోన్ స్టాటిక్ నాచ్‌కు బదులుగా హ్యాండ్సెట్ డిస్ ప్లే ఎగువన డైనమిక్ ఐలాండ్‌ను కలిగి ఉంది. డిజైన్ అయితే ఇప్పటికే 14 ప్రో దాని తర్వాత వచ్చిన మోడలతో సహా కొత్త ఐఫోన్లలో కనిపించింది. మరి iPhone SE 4 స్పెసిఫికేషన్లు ఏంటి? ధర ఎంత వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
iPhone SE 4 స్పెసిఫికేషన్లు
iPhone SE 4 నెక్స్ట్ జెన్ iPhone SE 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫేస్ IDతో వస్తుంది. USB-C పోర్ట్, సింగిల్ 48MP బ్యాక్ కెమెరా, Apple ఇంటెలిజెన్స్ మద్దతు కోసం 8GB వరకు RAM కూడా కలిగి ఉండే అవకాశముంది. A18 బయోనిక్ చిప్సెట్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ఇవేకాకుండా.. యాపిల్ నుంచి వచ్చే మొదటి 5G మోడెమ్ ఇదే కావొచ్చు. డిజైన్ బేస్ ఐఫోన్ 14, ఐఫోన్ 16 మోడళ్ల మాదిరిగానే కనిపిస్తుంది.
iPhone SE 4 డిజైన్, ఫీచర్లు
మునుపటి లీక్ ఐఫోన్ SE 4 డమ్మీ యూనిట్లను నలుపు, తెలుపు రంగులలో కనిపించింది. SIM ట్రేతో పాటు ఎడమ వైపున వాల్యూమ్ బటన్‌లు, మ్యూట్ స్విచ్‌తో సైడ్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయి. LED ఫ్లాష్ యూనిట్ పక్కన, వెనుక ప్యానెల్ ఎగువ ఎడమ అంచున రౌండ్ స్లాట్‌లో ఒకే కెమెరా సెన్సార్ కనిపిస్తుంది. పోస్ట్‌లో M3 చిప్‌సెట్‌తో కూడిన ఐప్యాడ్ ఎయిర్ 11-అంగుళాల, 13-అంగుళాల వేరియంట్‌లతో కనిపించింది.
Apple ఇంటెలిజెన్స్‌కు
Apple ఇంటెలిజెన్స్‌కు మద్దతు ఇచ్చేలా iPhone SE 4ను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. పైగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్‌గా మార్కెట్లోకి రానుంది. AI-ఆధారిత ఫీచర్‌ల సూట్‌లో రైటింగ్ టూల్స్, నోటిఫికేషన్‌లు, ChatGPT ఇంటిగ్రేషన్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి ఆప్షన్స్ ఉండనున్నాయి. ఇది iPhone 15, iPhone 16 వంటి హై-ఎండ్ మోడల్‌లకు వ్యతిరేకంగా iPhone SE 4ని బలమైన పోటీదారుగా మారే అవకాశముందంటున్నారు నిపుణులు.
iPhone SE 4 ధర
Apple ఈ ఏడాది ఏప్రిల్ నాటికి iPhone SE 4ని విడుదల చేయనుంది. యూఎస్‌లో దీని ధర $500 (దాదాపు 42,000) కంటే తక్కువగా ఉంటుంది. దక్షణ కొరియాలో దీని ధర KRW 8,00,000 (దాదాపు 46,000) కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ ఫీచర్స్.. ఇకపై మూడు నిమిషాల నిడివి ఉన్న రీల్స్ పోస్ట్ చేయవచ్చట, మరో అప్‌డేట్ కూడా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

