Apple Event 2023 LIVE: ముగిసిన యాపిల్ ఈవెంట్ - ఐఫోన్ 15 సిరీస్ ధర ఎంత?
Apple Event 2023 LIVE Updates: 2023 యాపిల్ ఈవెంట్ లైవ్ లాంచ్ అప్‌డేట్స్
LIVE

Background
ఐఫోన్ 15 ప్రో సిరీస్ ధర ఇలా...
ఐఫోన్ 15 ప్రో ధర 999 డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.82,800) నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర 1199 డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.99,300) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్టోరేజ్ 256 జీబీ నుంచి ప్రారంభం కానుంది.
వావ్ అనిపించే టెలిఫొటో కెమెరా
ఐఫోన్ 15 ప్రోలో 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 3x టెలిఫొటో కెమెరాను అందించారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 5x జూమ్ ఫీచర్ అందుబాటులో ఉన్న 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంది.
మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో...
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల్లో యాపిల్ బయోనిక్ ఏ17 ప్రో ప్రాసెసర్‌ను అందించారు. యాపిల్ ఇంతవరకు రూపొందించిన పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఇదే.
మ్యూబ్ బటన్ పాయే... యాక్షన్ బటన్ వచ్చే...
యాపిల్ ఫోన్లలో కనిపించే మ్యూట్ బటన్‌ను కూడా కంపెనీ తీసేసింది. ఇందులో కొత్త యాక్షన్ బటన్ ఉండనుంది. దీని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాయిస్ రికార్డింగ్‌ను కూడా ఈ బటన్‌తో ప్రారంభించవచ్చు.
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో ఎంట్రీ
నాసా మార్స్ రోవర్‌లో ఉపయోగించిన గ్రేడ్ 5 టైటానియం ఛాసిస్‌ను ఐఫోన్ 15 ప్రోలో ఉపయోగించారు. ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే అందుబాటులో ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

