Microsoft Surface Pro 8: ల్యాప్‌టాప్‌లానే కాదు ట్యాబ్లెట్‌లానూ వాడచ్చు.. మైక్రోసాఫ్ట్ సూపర్ ల్యాపీ.. రేటు మాత్రం ఘాటు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కొత్త ల్యాప్‌టాప్‌లను మనదేశంలో లాంచ్ చేసింది.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8, సర్ఫేస్ ప్రో 7ప్లస్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. వీటిలో 11వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లను అందించారు. 16 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇవి అందించనున్నాయి.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8, సర్ఫేస్ ప్రో 7 ప్లస్ ధర
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8లో వైఫై ఓన్లీ వేరియంట్ ధరను రూ.1,04,999గా నిర్ణయించారు. ఇక ఎల్టీఈ మోడల్ ధర రూ.1,27,999గా ఉంది. అమెజాన్, రిలయన్స్ డిజిటల్ వంటి ఈ కామర్స్ వెబ్ సైట్లలో దీని సేల్ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి జరగనుంది.
ఇక మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 7 ప్లస్ విషయానికి వస్తే.. ఇందులో వైఫై ఓన్లీ మోడల్ ధరను రూ.83,999గా నిర్ణయించారు. ఇక ఎల్టీఈ మోడల్ ధర రూ.1,04,999గా ఉంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి దీని సేల్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8 స్పెసిఫికేషన్లు
ఇందులో 11వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అందించారు. సర్ఫేస్ 7 కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. వైఫై మోడల్‌లో 32 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఉండనుందని తెలుస్తోంది. దీని ఎల్టీఈ వేరియంట్లో 17 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉండనున్నాయి.
ఇందులో 13 అంగుళాల పిక్సెల్ సెన్స్ టచ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఇక వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను ముందువైపు అందించారు. వెనకవైపు 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఎల్టీఈ వెర్షన్‌లో సిమ్ కార్డు స్లాట్ ఉండనుంది.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 7 ప్లస్ స్పెసిఫికేషన్లు
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 7 ప్లస్ ధర ఎక్కువ అని ఫీలయ్యే వారికి ఇది మంచి ఆప్షన్. ఇందులో 11వ తరం ఇంటెల్ ప్రాసెసర్లు ఉణ్నాయి. వైఫై వేరియంట్లో 32 జీబీ వరకు, ఎల్టీఈ వేరియంట్లో 16 జీబీ వరకు ర్యామ్ అందించారు. ఐ3, ఐ5, ఐ5 ప్రాసెసర్ వేరియంట్లు కూడా ఇందులో ఉన్నాయి.
మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 7 ప్లస్‌లో 12 అంగుళాల పిక్సెల్‌సెన్స్ టచ్ డిస్‌ప్లేను అందించారు. 1 టీబీ వరకు రిమూవబుల్ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. ముందువైపు 5 మెగాపిక్సెల్, వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. వైఫై 6, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!