Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?
Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది.
Copilot iOS Launched: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో టెక్ కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. ఓపెన్ఏఐ లాంచ్ చేసిన ఛాట్‌జీపీటీ ఈ పోటీని మరింత తీవ్రం చేసింది. ఇప్పుడు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ పోరులోకి దిగింది. కంపెనీ ఇటీవల తన మొబైల్ ఏఐ యాప్‌ను పరిచయం చేసింది.
మొదట ఆండ్రాయిడ్ కోసం
మైక్రోసాఫ్ట్ యొక్క ఏఐ మొబైల్ యాప్‌కు కోపైలట్ అని పేరు పెట్టారు. ఈ యాప్ ఓపెన్ఏఐ ఛాట్‌జీపీటీ యాప్‌ని పోలి ఉంటుంది. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్ కోసం తన ఏఐ యాప్ కోపైలట్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇది యాపిల్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏఐ యాప్‌ను ఐఫోన్, ఐప్యాడ్ యాపిల్ పరికరాలలో కూడా ఉపయోగించవచ్చు.
కోపైలట్ యాప్‌ను ఇంతకుముందు బింగ్ చాట్ అని పిలిచేవారు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ పేరుతో కొన్ని అప్‌డేట్‌లతో యాప్‌ను తిరిగి లాంచ్ చేసింది. కోపైలట్ ఏఐ యాప్ ఛాట్‌జీపీటీ తరహా లోనే పనిచేస్తుంది. కోపైలట్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది. దీంతో ఏఐ రంగంలో కొత్త పోటీ మొదలైంది.
మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్‌లో మీరు ఛాట్‌జీపీటీ లాగానే ప్రశ్నలు అడిగే సదుపాయాన్ని పొందుతారు. ఇది మాత్రమే కాకుండా ఇమేజ్ క్రియేషన్, ఈ-మెయిల్స్, డాక్యుమెంట్‌ల కోసం డ్రాఫ్ట్ నోట్స్, డాల్-ఈ 3 ద్వారా జీపీటీ-4 సౌకర్యాన్ని కలిగి ఉంది. జీపీటీ-4 అనేది ఓపెన్ ఏఐ ఛాట్ జీపీటీలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఫీచర్. కానీ దీన్ని కోపైలట్‌లో ఉచితంగా ఉపయోగించవచ్చు. మొదట కంపెనీ ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే విడుదల చేసింది. ఇప్పుడు ఐవోఎస్ వినియోగదారుల కోసం కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
మైక్రోసాఫ్ట్ ఏఐ యాప్ కోపైలట్ ఛాట్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. ఇది ఓపెన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ జీపీటీ-4, డాల్ ఈ 3 సామర్థ్యాలను ఉపయోగించుకుంటుంది. ఛాట్ జీపీటీ యాప్ ఫ్రీ వెర్షన్ జీపీటీ-3.5లో పనిచేస్తుంది. అయితే మైక్రోసాఫ్ట్ కోపైలట్ యాప్ ఓపెన్ ఏఐ సరికొత్త పెద్ద భాషా మోడల్ జీపీటీ 4పై పనిచేస్తుంది.
వినియోగదారుల ఉత్పాదకతను పెంచడంలో కోపైలట్ ఏఐ యాప్ సహాయకరంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ యాప్‌లో ఛాట్‌బాట్ ఫంక్షనాలిటీ, డాల్ ఈ 3 ద్వారా అందించే ఇమేజ్ జనరేషన్, ఈమెయిల్స్, డాక్యుమెంట్‌ల కోసం స్ట్రీమ్‌లైన్డ్ టెక్స్ట్ డ్రాఫ్టింగ్ వంటి గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ సాధారణ టెక్స్ట్‌కు విజువల్స్ రూపం ఇవ్వగలదు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!