అన్వేషించండి

How To Block Your Lost Phone: మీరు పోగొట్టుకున్న ఫోన్ ఎలా బ్లాక్ చేయాలో తెలుసా

How To Block Your Lost Smartphone | మీరు ఫోన్ పోగొట్టుకోవడం, లేక చోరీ అయినా ceir.gov.in లో వివరాలు సమర్పిస్తే ఆ ఫోన్ బ్లాక్ అవుతుంది. తిరిగి దొరికితే అన్ బ్లాక్ చేసుకోవచ్చు.

How To Block Your Lost Phone | మీ ఫోన్ పోగొట్టుకున్నారా.. లేక ఎవరైనా దొంగిలించినా వెంటనే మీరు అలర్ట్ కావాలి. మొదటగా మీ ఫోన్ పోవడంతో మీలో కంగారు, ఆందోళన ఉంటుంది. అయితే భయాందోళన, నిరాశ మధ్య, ఒక ప్రశ్న తలెత్తుతుంది. నా పరికరానికి (Lost My Phone) అనధికారికంగా యాక్సెస్ చేయకుండా ఏం చేయగలను? అదృష్టవశాత్తూ, భారతదేశంలోని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ద్వారా నిర్వహిస్తున్న CEIR పోర్టల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి ఒక లైఫ్‌లైన్‌ను అందిస్తుంది.

మీకు ఏమేం కావాలి.. 

మీరు ప్రారంభించే ముందు, కింది వాటిని సేకరించాలి..

  1. మీ ఫోన్ IMEI నంబర్ (మీరు *#06# డయల్ చేయడం ద్వారా, ఫోన్ బాక్సును చెక్ చేయడం ద్వారా లేదా ఇన్వాయిస్ ద్వారా తెలుసుకోవచ్చు).
  2. పోగొట్టుకున్న లేదా చోరీ అయిన మొబైల్ కోసం నమోదు చేయబడిన పోలీసు ఫిర్యాదు లేదా FIR కాపీ అవసరం.
  3. మీ ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్, పాన్, మొదలైనవి).
  4. OTPని స్వీకరించడానికి ఆ ఫోన్లో ఇంతకు ముందు ఉపయోగించిన మొబైల్ నంబర్ (లేదా వాటిలో కనీసం ఒకటి).

CEIR ద్వారా మీ ఫోన్‌ను ఎలా బ్లాక్ చేయాలి

  1. CEIR పోర్టల్‌కి వెళ్లాలి: ceir.gov.in లేదా సంబంధిత “సంచార్ సాథి పోర్టల్” లింక్ ద్వారా.
  2. “బ్లాక్ స్టోలెన్/ లాస్ట్ మొబైల్” (లేదా ఇలాంటి పదాలు)పై క్లిక్ చేయాలి
  3. ఫామ్‌ను ఈ వివరాలతో ఫిల్ చేయండి.. 
    - ఆ పరికరానికి సంబంధించిన మీ మొబైల్ నంబర్‌లు.
    - పోగొట్టుకున్న/ చోరీ అయిన ఫోన్ IMEI నంబర్‌లు.
    - ఆ ఫోన్ కంపెనీ బ్రాండ్, మోడల్.
    - ఫోన్ కొనుగోలు చేసిన ఇన్వాయిస్‌ను అప్‌లోడ్ చేయండి (అడిగితే).
    - పోవడం లేదా దొంగతనం జరిగిన తేదీ, స్థలం.
    - పోలీస్ స్టేషన్, ఫిర్యాదు నంబర్, పోలీసు ఫిర్యాదు కాపీని అప్‌లోడ్ చేయండి.
    - మీ పేరు, చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, నంబర్, ఇమెయిల్. 
  4. OTPని స్వీకరించే మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి. OTP పొందాక ఆ OTPని ధృవీకరించాలి
  5. ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. ఒక రిక్వెస్ట్ ID వస్తుంది. దాని స్టేటస్ ట్రాక్ చేయడానికి ఆ IDని సేవ్ చేయండి. 
  6. సబ్మిట్ చేసిన తర్వాత, CEIR సిస్టమ్ మీ పరికరం IMEIని బ్లాక్ చేసినట్లు గుర్తిస్తుంది. హ్యాండ్‌సెట్ భారత టెలికాం నెట్‌వర్క్‌లలో ఉపయోంచడం కుదరదు 

మీరు సబ్మిట్ చేసిన తర్వాత

  1. మీరు రిక్వెస్ట్ ID లేదా ఫిర్యాదు నంబర్‌ ఎంటర్ చేయడం ద్వారా మీ అభ్యర్థన స్థితి (Application Status)ని తనిఖీ చేయవచ్చు.
  2. మీరు తర్వాత మీ ఫోన్‌ను తిరిగి పొందినట్లయితే, మీరు అన్‌బ్లాక్ ఫామ్‌ను ఉపయోగించి అదే పోర్టల్ ద్వారా అన్‌బ్లాక్ చేయడానికి సైతం అప్లై చేసుకోవచ్చు. 

గమనిక: బ్లాకింగ్ మీ ఫోన్‌ను ట్రాక్ చేయదు లేదా గుర్తించదు. ఇది కేవలం ఆ మొబైల్‌ను ఏ నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధిస్తుంది. 

CEIR పోర్టల్ ద్వారా మీ పరికరాన్ని బ్లాక్ చేయడం వలన దాని దుర్వినియోగాన్ని నిరోధించడమే కాకుండా, ఫోన్‌ను పనిచేయకుండా చేయవచ్చు. అధికారిక చర్యల ద్వారా చట్ట అమలు ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget