అన్వేషించండి

Best Smartphone Under Rs 20000: ఇరవై వేల కంటే తక్కువ ధరకు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, 64 మెగా పిక్సెల్ కెమెరా సైతం

Best Mobiles Under Rs 20000 | నేడు మొబైల్ కంపెనీలు తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 20,000 లోపు లభించే స్మార్ట్‌ఫోన్‌ల జాబితా ఇది.

Best Smartphones Under Rs 20000 | స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్‌లతో స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తున్నాయి. చాలా కంపెనీలు తమ  బడ్జెట్ ఫోన్‌లలో 50MP కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీలను అందిస్తున్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, కానీ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఏ టెన్షన్ అక్కర్లేదు. ఈ రోజు  మీ కోసం 20 వేల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన చవకైన స్మార్ట్‌ఫోన్‌లు, వాటి ఫీచర్లను ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇందులో ఖరీదైన ఫోన్‌ల ఫీచర్‌లు ఉన్నాయి.

వివో టీ4ఆర్ (Vivo T4R 5G) 

Vivoకి చెందిన ఈ ఫోన్ 6.77 అంగుళాల బిగ్ డిస్‌ప్లేతో వస్తుంది. మల్టీ టాస్కింగ్, బెస్ట్ పర్మార్మెన్స్ కోసం ఇది Dimensity 7400 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది 8 GB RAM, 128GB స్టోరేజీలో మార్కెట్లోకి వచ్చింది. దీని వెనుక భాగంలో OISతో 50MP మెయిన్ సెన్సార్ ఉంది. రెండవ కెమెరా 2MP ఉంది. ముందు భాగంలో ఇది 32MP లెన్స్‌తో వస్తుంది. 5700 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నుండి రూ. 19,499లకు కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ నోట్ (Infinix Note 50s 5G+)

చవకైన ధరలో Infinix సైతం అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్‌ను అందిస్తోంది. కంపెనీ Note 50s 5G+ 6.78 అంగుళాల Full HD+ డిస్‌ప్లే ఇచ్చింది. ఇన్ఫినిక్స్ ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సెల్ + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఇది 13MP ఫ్రంట్ లెన్స్‌తో సర్వీస్ ఇస్తుంది. 5500 mAh బ్యాటరీ కలిగిన ఈ ఇన్ఫినిక్స్ నోట్ ఫోన్‌లో Dimensity 7300 Ultimate ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 8 GB RAMతో మార్కెట్లోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ ఫోన్ రూ. 17,999 ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఏదైనా కార్డుతో ఆఫర్ ఉంటే ఇంకా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. 

మోటోరొలా MOTOROLA G86 Power 5G 

అందుబాటు ధరలో అంటే Motorola G86 Power 5G  ఈ ఫోన్ మంచి చాయిస్. ఇది కూడా 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6720 mAh పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. Dimensity 7400 ప్రాసెసర్‌ ఇచ్చారు. దీని వెనుక భాగంలో 50MP+8MP డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ. 16,999లకు లిస్ట్ చేవారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఏదైనా కార్డులపై ఆఫర్ ఉంటే ఆ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Pushpa 2 Japan Release : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు-  వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
Naga chaitanya Sobhita Marriage : నాగచైతన్య శోభిత మొదటి పెళ్లి రోజు - బ్యూటిఫుల్ మూమెంట్ షేర్ చేసిన శోభిత
నాగచైతన్య శోభిత మొదటి పెళ్లి రోజు - బ్యూటిఫుల్ మూమెంట్ షేర్ చేసిన శోభిత
Tamil Film Producer AVM Saravanan: తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
తమిళ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత- నిన్నే పుట్టినరోజు చేసుకున్న ఏవీఎం సంస్థ ఓనర్‌!
Embed widget