అన్వేషించండి

AI News Anchor: న్యూస్ యాంకర్లకు ఇక ముప్పే - వార్తలు చదివి వినిపిస్తున్న AI న్యూస్ ప్రెజెంటర్, మన పక్క రాష్ట్రంలోనే!

రీజినల్ టెలివిజన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ఒడిశాలో తొలిసారి AI న్యూస్ ప్రెజెంటర్ వార్తలు చదివి అందరినీ ఆశ్యర్య పరిచింది. ఇంతకీ ఈ న్యూస్ యాంకర్ ఏ టీవీలో కనిపించిందో తెలుసా?

రోజు రోజుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పెరిగిపోతోంది. ఇప్పటికే ఆటో మోబైల్, టెలీ కమ్యూనికేషన్ సహా పలు రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మ్యాన్ పవర్ తగ్గి, యాంత్రీకరణ పెరిగిపోయింది. దీంతో అదనపు ఉత్పత్తి  లభిస్తోంది. ఇక తాజాగా మీడియా రంగంలోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చేరింది. ఇప్పటి వరకు విదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యూస్ చదివే యాంకర్లు చూశాం. ఈ మధ్యే ఇండియాలోనూ ఈ ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటికే కొన్ని జాతీయ చానెళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్స్ ను పరిచయం చేశాయి. ఇక ప్రస్తుతం రీజినల్ చానెల్స్ లోనూ AI ప్రెజెంటర్ రాక మొదలయ్యింది.

ఒడిశాలో ఫస్ట్ AI న్యూస్ ప్రెజెంటర్

తాజాగా ఒడిశాలో ఓ న్యూస్ ఛానెల్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్ తో వార్తలు చదివి అందరినీ ఆశ్చర్య పరిచింది. భువనేశ్వర్‌కు చెందిన ఒడిశా టెలివిజన్ నెట్‌వర్క్(OTV)యాజమాన్యం ఈ AI యాంకర్‌కు లిసాగా నామకరణం చేసింది. ఈ న్యూస్ యాంకర్ ఒడిశాలోని ప్రైవేట్ ఛానెల్ లో అచ్చ భారతీయ మహిళగా కనిపిస్తూ వార్తలు చదివింది. ఒడిశా సంప్రదాయ చేనేత చీర ధరించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్ ఇంగ్లీష్ తో పాటు ఒరియాలో వార్తలు వినిపించింది. అచ్చంగా అమ్మాయి మాదిరిగానే కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. వార్తలు చదివేది అమ్మాయి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ ప్రెజెంటర్ అని తెలుసుకుని ప్రేక్షకులు షాక్ అయ్యారు.

ఒరియా, ఇంగ్లీష్ లో వార్తలు చదువుతున్న లిసా

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ప్రెజెంటర్ పేరు లిసా టీవీతో పాటు, డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లలో ప్రధాన యాంకర్‌గా వ్యవహరిస్తుందని OTV  యాజమాన్యం వెల్లడించింది. టీవీ బ్రాడ్‌ కాస్టింగ్, జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ యాంకర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. లిసా ప్రపంచంలోని అన్ని భాషలను పలుకుతుందని వెల్లడించింది. అయితే, ప్రస్తుతం లీసా ఒరియా, ఇంగ్లీషులో మాత్రమే వార్తలు చదువుతందని తెలిపింది.   ఇక లిసా పేరుతో OTV యాజమాన్యం సోషల్ మీడియాలో అకౌంట్లు కూడా ఓపెన్ చేసింది. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ప్రెజెంటర్ హవా పెరుగుతుందని OTV యాజమాన్యం తెలిపింది.  

“ఒరియాలో లిసాకు శిక్షణ ఇవ్వడం చాలా పెద్ద పని అయినా, మేము చేసి చూపించామని OTV డిజిటల్ బిజినెస్ హెడ్ లితీషా మంగత్ పాండా వెల్లడించారు. మేము ఇంకా లిసాకు శిక్షణ ఇస్తూనే ఉన్నాం. ఈ న్యూస్ ప్రెజెంటర్ ఇతరులతో సులభంగా సంభాషించగలిగే స్థాయికి తీసుకురావాలి అని భావిస్తున్నాం” అన్నారు.  

OTV గురించి..

OTV భువనేశ్వర్‌కు చెందిన ఒడిషా టెలివిజన్ నెట్‌వర్క్ యాజమాన్యంలో కొనసాగుతోంది. జాగి మంగత్ పాండా ఈ చానెల్ ను ప్రారంభించింది. ఒడిషా టెలివిజన్ ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రానిక్ మీడియా.  ఇది 1997లో జంట నగరాలైన భువనేశ్వర్, కటక్‌ లో ప్రసారాలను ప్రారంభించింది.  ఆ తర్వాత నెమ్మదిగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించింది. డిసెంబర్ 2006లో కేబుల్ నుంచిశాటిలైట్ ఛానెల్‌గా మార్చబడింది.

Read Also: రామ్ పోతినేనితో పూరీ కొత్త సినిమా షురూ- అట్టహాసం ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Embed widget