By: ABP Desam | Updated at : 05 Aug 2023 04:33 PM (IST)
జియోబుక్ 2023 ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం అయింది. ( Image Source : Reliance Retail )
జియోబుక్ 2023 ల్యాప్‌టాప్ సేల్ భారతదేశంలో ప్రారంభం అయింది. జియో లాంచ్ చేసిన రెండో తరం ల్యాప్‌టాప్ ఇదే. ఈ ల్యాప్‌టాప్‌ను ప్లాస్టిక్ బాడీతో రూపొందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 8788 ప్రాసెసర్‌పై జియోబుక్ 2023 కొత్త ల్యాప్‌టాప్ పని చేయనుంది. జియో బ్లూ కలర్ ఆప్షన్‌లో దీన్ని లాంచ్ అయింది. ఇన్‌బిల్ట్ సిమ్ కార్డుతో ఈ కొత్త జియో ల్యాప్ టాప్ రానుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, హెచ్‌డీఎంఐ మినీ పోర్టు కూడా ఇందులో అందించారు. జియోబుక్ 2023 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 8 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఈ ల్యాప్‌టాప్ అందించనుంది.
జియోబుక్ 2023 ధర, సేల్ వివరాలు
ఈ ల్యాప్‌టాప్ ధరను మనదేశంలో రూ.16,499గా నిర్ణయించారు. జియో బ్లూ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, రిలయన్స్ డిజిటల్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. రిలయన్స్ జియోబుక్ మొదటి తరం ల్యాప్‌టాప్ గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయింది. జియోబుక్ మొదటి వెర్షన్ ధర లాంచ్ అయినప్పుడు రూ.15,799గా ఉంది.
జియోబుక్ 2023 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ ఆధారిత జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ కొత్త ల్యాప్‌టాప్ పని చేయనుంది. ఇందులో 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే అందించారు. ఈ 4జీ ల్యాప్‌టాప్ ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది. 4జీ సిమ్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ8788 ప్రాసెసర్ ద్వారా జియోబుక్ 2023 రన్ అవుతుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
గత సంవత్సరం లాంచ్ అయిన జియోబుక్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. వైఫై, బ్లూటూత్ 5, హెచ్‌డీఎంఐ మినీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 2 మెగా పిక్సెల్ వెబ్ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఎనిమిది గంటల బ్యాటరీ లైఫ్‌ను జియోబుక్ 2023 అందించనుంది. జియోబుక్ 2023 బరువు కూడా చాలా తక్కువగా ఉంది. కేవలం 990 గ్రాముల బరువుతోనే ఈ ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి వచ్చింది. గతేడాది లాంచ్ అయిన జియోబుక్ మొదటి వెర్షన్ ల్యాప్‌టాప్ బరువు 1.2 కిలోలుగా ఉంది.
Welcome your ultimate learning book - JioBook. An all-in-one solution for learning anything, anytime, anywhere. 😎
— Reliance Jio (@reliancejio) July 31, 2023
Pre-order your all new JioBook now https://t.co/5jnRKhPN4B#AllNewJioBook #AllNewJioBookLaptop #Laptop #Jio #Learning #Entertainment pic.twitter.com/Yo16aXMLGv
Watch the 𝗚reatest . 𝗔ction . 𝗠ovie . 𝗘ver with JioFiber.
— Reliance Jio (@reliancejio) July 2, 2023
Following a successful theatrical run- John Wick 4 is now streaming on Lionsgate Play.
With Jio Set-top box you can enjoy 550+ TV Channels | 14+ OTT apps | Internet upto 1Gbps
Plans starting at just ₹599/month. Get… pic.twitter.com/GwqYbeKAOC
Read Also: ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Black Friday Sale 2023: భారతదేశ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు - అమెజాన్ నుంచి యాపిల్ వరకు!
Best Laptop Under 50000: రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఫీచర్లు, పెర్ఫార్మెన్స్, డిజైన్‌లో బెస్ట్ ఇవే!
Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి - లేకపోతే మార్చుకోవడమే!
Apple Scary Fast: యాపిల్ ఈవెంట్ రేపే - ‘స్కేరీ ఫాస్ట్’లో ఏం లాంచ్ కానున్నాయి?
Amazon Vs Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి? - వీటి ద్వారా మరింత తగ్గనున్న ధరలు!
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
/body>