News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

రూ.15 వేలలోపే ల్యాప్‌టాప్ - కొత్త మార్కెట్‌పై దాడికి జియో సిద్ధం!

జియో మనదేశంలో రూ.15 వేలలోపే చవకైన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనుంది.

FOLLOW US: 
Share:

రిలయన్స్ జియో మనదేశంలో అత్యంత బడ్జెట్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని కోసం క్వాల్‌కాం, మైక్రోసాఫ్ట్‌లతో జియో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.15 వేల రేంజ్‌లోనే ఉండనుందని సమాచారం. ఏఆర్ఎం టెక్నాలజీ, విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డివైస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. విండోస్ యాప్స్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయనుంది.

420 మిలియన్లకు పైగా కస్టమర్లతో భారతదేశపు అతిపెద్ద టెలికాం క్యారియర్ అయిన జియో దీనిపై ఇంతవరకు స్పందించలేదు. ఈ ల్యాప్‌టాప్ ఈ నెల నుంచి పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు వంటి ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని, రాబోయే మూడు నెలల్లో సాధారణ వినియోగదారులకు లాంచ్ అవుతుందని తెలుస్తోంది. JioPhone మాదిరిగానే, ఇందులో కూడా 5G వెర్షన్ రానుంది.

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, గత ఏడాది చివర్లో లాంచ్ అయినప్పటి నుంచి మనదేశంలో రూ.8 వేలలోపు ధరలో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యాండ్‌సెట్‌గా జియో ఫోన్ నిలిచింది. గత మూడు త్రైమాసికాల్లో మార్కెట్‌లో ఐదో వంతు వాటాను ఈ ఫోన్ దక్కించుకుంది.

JioBookను కాంట్రాక్ట్ తయారీదారు ఫ్లెక్స్ స్థానికంగా ఉత్పత్తి చేస్తుంది. మార్చి నాటికి లక్ష యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. పరిశోధనా సంస్థ IDC ప్రకారం గత సంవత్సరం భారతదేశంలో మొత్తం పీసీ షిప్‌మెంట్లు 14.8 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. HP, Dell, Lenovo కంపెనీలు ముందంజలో ఉన్నాయి.

జియోబుక్ ల్యాప్‌టాప్ మార్కెట్ సెగ్మెంట్‌ను కనీసం 15 శాతం వరకు పొడిగించగలదని కౌంటర్ పాయింట్ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ తెలిపారు.

ల్యాప్‌టాప్ Jio తన స్వంత JioOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. జియోస్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కార్యాలయంలోని కార్పొరేట్ ఉద్యోగుల కోసం టాబ్లెట్‌లకు ప్రత్యామ్నాయంగా జియో ల్యాప్‌టాప్‌ను కూడా పిచ్ చేస్తోంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Smartprix.com (@smartprix)

Published at : 03 Oct 2022 07:53 PM (IST) Tags: Jio JioBook Jio Affordable Laptop Jio Cheapest Laptop Jio Laptop

ఇవి కూడా చూడండి

Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!

HP Dragonfly Laptop: HP నుంచి సరికొత్త డ్రాగన్‌ ఫ్లై ల్యాప్‌టాప్‌ విడుదల- ధర, ఫీచర్లు ఇవే!

HP Dragonfly Laptop: HP నుంచి సరికొత్త డ్రాగన్‌ ఫ్లై ల్యాప్‌టాప్‌ విడుదల- ధర, ఫీచర్లు ఇవే!

JioBook 2023: జియో కొత్త ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం - ధర రూ.17 వేలలోపే!

JioBook 2023: జియో కొత్త ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం - ధర రూ.17 వేలలోపే!

Laptop Import Ban: అలర్ట్‌! ఈ ల్యాప్‌టాప్‌లను బ్యాన్‌ చేసిన మోదీ సర్కారు!

Laptop Import Ban: అలర్ట్‌! ఈ ల్యాప్‌టాప్‌లను బ్యాన్‌ చేసిన మోదీ సర్కారు!

JioBook 2023: రూ.17 వేలలోపే జియో ల్యాప్‌టాప్ - లాంచ్ చేసిన టెలికాం దిగ్గజం!

JioBook 2023: రూ.17 వేలలోపే జియో ల్యాప్‌టాప్ - లాంచ్ చేసిన టెలికాం దిగ్గజం!

టాప్ స్టోరీస్

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

BRS Candidates :  సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు