![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Infinix InBook X1 Slim Sale: ఇన్‌ఫీనిక్స్ చవకైన ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం - రూ.30 వేలలోపే సూపర్ ఫీచర్లు!
ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 ల్యాప్ టాప్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది.
![Infinix InBook X1 Slim Sale: ఇన్‌ఫీనిక్స్ చవకైన ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం - రూ.30 వేలలోపే సూపర్ ఫీచర్లు! Infinix InBook X1 Slim Sale Started in India Check Price Offers Infinix InBook X1 Slim Sale: ఇన్‌ఫీనిక్స్ చవకైన ల్యాప్‌టాప్ సేల్ ప్రారంభం - రూ.30 వేలలోపే సూపర్ ఫీచర్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/24253503e4f2a481acd39f7b3f27f4db_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో ఇన్‌బుక్ ఎక్స్1 అనే కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసింది. ఈ ల్యాప్‌టాప్ సేల్ ఇప్పుడు మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో 14 అంగుళాల డిస్‌ప్లే, 10వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 50డబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించనున్నారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్‌ను ఇన్‌ఫీనిక్స్ ఇందులో అందించడం విశేషం.
ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ఐ3 + 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990గానూ, ఐ3 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,990గానూ ఉంది. ఐ5 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,990గానూ, ఐ5 + 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,990గా నిర్ణయించారు. గ్రే, బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ల్యాప్‌టాప్ కొంటే రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది.
ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ ఫీచర్లు
ఫుల్ మెటల్ బాడీ, అల్యూమినియం అలోయ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఇందులో ఉంది. దీని స్క్రీన్ పిక్సెల్ రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్‌గా ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 16:9 కాగా, 10వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌లను ఇన్‌ఫీనిక్స్ అందించింది.
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ పనిచేయనుంది. ఇందులో 50 డబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 11 గంటల బ్రౌజింగ్, 11 గంటల వెబ్ బ్రౌజింగ్, 9 గంటల రెగ్యులర్ వర్క్, 9 గంటల వీడియో ప్లేబ్యాక్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 90 నిమిషాల సమయం పట్టనుందని కంపెనీ తెలిపింది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)