JioTV Premium Plans: ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - జియో టీవీ ప్రీమియం ప్లాన్లు లాంచ్!
JioTV New Plans: జియోటీవీ ప్రీమియం ప్లాన్లను మనదేశంలో ప్రారంభించింది.
JioTV Plans: దేశంలోని నంబర్ వన్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో వినియోగదారులకు పూర్తి వినోదాన్ని అందించడానికి మూడు కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది. కొత్తగా మూడు 'జియో టీవీ ప్రీమియం ప్లాన్'లను లాంచ్ చేసింది. దీని ద్వారా వినియోగదారులు ఒకే రీఛార్జ్ ద్వారా 14 వేర్వేరు ఓటీటీ యాప్‌ల్లోని కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.
అంటే దీని కోసం మీరు వివిధ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ తీసుకోనవసరం లేదన్న మాట. ఈ ప్లాన్‌లతో కేవలం ఓటీటీ ప్రయోజనాలు మాత్రమే కాకుండా డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ఆ ప్లాన్లు ఏంటి? వాటి లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్లాన్లు ఇలా...
జియో కొత్తగా మూడు జియో టీవీ ప్రీమియం ప్లాన్‌లను ప్రారంభించింది. అవే ధర రూ. 398, రూ. 1,198, రూ. 4,498 ప్లాన్లు. ఈ ప్లాన్లు వేర్వేరు వాలిడిటీలతో వస్తాయి. మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏదైనా ప్లాన్‌ని ఎంచుకోవచ్చు.
జియో టీవీ ప్రీమియం ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే... జియో సినిమా ప్రీమియం, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, డాక్యుబే, సన్‌నెక్స్‌ట్, హొయ్‌చొయ్, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఎపిక్‌వన్ వంటి 14 ఓటీటీ సర్వీసులకు యాక్సెస్ పొందుతారు. రూ. 398 ప్లాన్‌లో 12 ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. రూ. 1,198, రూ. 4,498 ప్లాన్‌లతో 14 ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. రూ.398 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, రూ.1,198 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగానూ, 365 రోజుల వ్యాలిడిటీతో రూ.4,498గా ఉంది. మంచి విషయం ఏమిటంటే ప్రతి ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 2 జీబీ డేటాను కూడా పొందుతారు.
జియోటీవీ ప్రీమియం ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడం ద్వారా అనేక విభిన్న ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే అవసరం ఉండదు. జియో టీవీ యాప్‌కి సైన్ ఇన్ చేయడం ద్వారా, ఓటీటీ యాప్స్ కోసం ప్రత్యేక లాగిన్‌లు, పాస్‌వర్డ్‌లను సృష్టించడం, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఒకే చోట నుంచి విభిన్న యాప్‌ల కంటెంట్‌ను వీక్షించగలరు. రూ. 4,498 ప్లాన్ తీసుకున్న తర్వాత మీరు సింగిల్ క్లిక్ కస్టమర్ కేర్ కాల్ బ్యాక్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ప్లాన్ చెల్లింపును ఈఎంఐ ద్వారా కూడా చేయవచ్చు.
రిలయన్స్ జియో ఇటీవలే సరికొత్త రూ.909 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా అందించనున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్ వంటి లాభాలు లభించనున్నాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా జీ, సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ కూడా రానుంది. జియో సినిమా, జియో యాప్స్, జియో క్లౌడ్ వంటి సర్వీసులు కూడా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!