జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రెండు చవకైన ప్లాన్లు తీసేసిన కంపెనీ!
భారతదేశ నంబర్ వన్ టెలికాం జియో తన రెండు చవకైన జియోఫోన్ ప్లాన్లను పోర్ట్ ఫోలియో నుంచి తొలగించింది. అవే జియోఫోన్ రూ.39, రూ.69 ప్లాన్లు.
రిలయన్స్ జియో తన జియో ఫోన్ యూజర్ల ప్లాన్లలో రెండు చవకైన ప్లాన్లను తొలగించింది. జియో ఫోన్ రూ.39, రూ.69 ప్లాన్లతో ఇప్పుడు రీచార్జ్ చేసుకోవడం లేదు. ఈ రెండు ప్లాన్లనూ జియో వెబ్ సైట్, మొబైల్ యాప్ నుంచి కూడా తొలగించారు.
వీటిలో రూ.39 ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 100 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్, ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వంటి లాభాలు అందించనున్నారు. ఇక రూ.69 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 500 ఎంబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభించనున్నాయి. దీని వ్యాలిడిటీ కూడా 14 రోజులుగానే ఉంది.
ఈ ప్లాన్లను పోర్ట్ ఫోలియో నుంచి తొలగించడంతో పాటు బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ ను కూడా జియో తొలగించింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు ఒక ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే అదే ప్లాన్ నెక్స్ట్ రీచార్జ్ కూడా ఉచితంగా లభించేది. వినియోగదారులకు ఈ ప్లాన్ కరోనావైరస్ పాండమిక్ సమయంలో బాగా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఈ ప్లాన్ ను కూడా జియో తొలగించింది.
అయితే జియో దీపావళికి తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే జియోఫోన్ నెక్స్ట్. ఆ స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయానికి జియో కొత్త ప్లాన్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. గూగుల్ భాగస్వామ్యంతో జియో ఈ ఫోన్ ను రూపొందిస్తుంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 10వ తేదీనే లాంచ్ కావాల్సి ఉండగా, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీ కండక్టర్ల కొరత కారణంగా దీపావళికి వాయిదా వేశారు.
గూగుల్ భాగస్వామ్యంతో జియో ఈ ఫోన్ రూపొందించింది. ఈ సంవత్సరం జూన్ లో జరిగిన వార్షిక సదస్సులో ఈ ఫోన్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఫోన్ ధర రూ.3,499గా ఉండగనుందని గతంలో వార్తలు వచ్చాయి.
గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్, వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ రీడ్ అలౌడ్, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన పలు ఫీచర్లు ఆన్ లైన్ లో ఇప్పటికే లీకయ్యాయి. 2500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఈ స్మార్ట్ ఫోన్ లో అందించనున్నారు. క్వాల్ కాం క్యూఎం215 ప్రాసెసర్ పై ఈ జియోఫోన్ నెక్స్ట్ పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Vodafone Idea: ఇక ఆ ఆఫర్ లేనట్లే.. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే తీసేసిన టెలికాం!
Also Read: ఈ 50 గ్రాముల డివైస్ మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చేస్తుంది.. మనదేశంలో లాంచ్!
Also Read: 55 అంగుళాల 4కే డిస్ ప్లే, వీడియో కెమెరా వంటి ఫీచర్లు.. అదిరిపోయే స్మార్ట్ టీవీ వచ్చేసింది!