Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
Jio 909 Plan: రిలయన్స్ జియో కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఈ రూ.909 ప్లాన్ ద్వారా సోనీ లివ్, జీ5 యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది.
Jio 909 Plan Benefits: రిలయన్స్ జియో సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభించనుంది. దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి. కేవలం ఈ లాభాలు మాత్రమే కాకుండా జీ, సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ కూడా అందించనున్నారు. దీంతోపాటు జియో సినిమా, జియో యాప్స్, జియో క్లౌడ్ వంటి సర్వీసులు కూడా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
రిలయన్స్ జియో వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ప్లాన్ ద్వారా మొత్తంగా 168 జీబీ డేటా లభించనుంది. ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. రోజుకు 2 జీబీ డేటా లెక్కన మొత్తంగా 168 జీబీ డేటా అన్న మాట. రోజుకు 2 జీబీ డేటా కోటా పూర్తయితే నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోనుంది. ఒకవేళ హైస్పీడ్ డేటా ప్లాన్స్ కావాలనుకుంటే డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ వేసుకోవచ్చు.
జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సర్వీసులకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. దీంతోపాటు అర్హులైన వినియోగదారులకు 5జీ కవరేజ్ కూడా లభించనుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే... జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ మాత్రమే లభించనుంది. జియో సినిమా ప్రీమియం కావాలంటే అదనపు మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు రిలయన్స్ జియో తన ఓపెన్ ఎయిర్ ఫైబర్ సేవను విస్తరించడంలో బిజీగా ఉంది. పశ్చిమ యూపీలోని 41 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్ తన సేవలను ఇటీవలే ప్రారంభించింది. పశ్చిమ యూపీలోని ఈ నగరాల్లో నివసిస్తున్న ప్రజలు దేశవ్యాప్తంగా జియో ఎయిర్ ఫైబర్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు వినియోగదారులు 16 ఓటీటీ యాప్స్, 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్స్‌ను చూసే అవకాశాన్ని కూడా పొందుతారు.
రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రారంభం అయింది. ఇటీవల ఇది పశ్చిమ యూపీలోని బరేలీ, అలీఘర్, సహరాన్‌పూర్, మొరాదాబాద్, ఇటావా, ఫిరోజాబాద్, మధుర, ముజఫర్ నగర్ సహా 39 ఇతర నగరాల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా 'లాస్ట్ మైల్ కనెక్టివిటీ'ని అందించడంలో ఇబ్బంది ఉన్న ప్రాంతాలకు జియో ఎయిర్ ఫైబర్ ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు. బ్రాడ్‌బ్యాండ్‌కు అనుసంధానం కాలేని లక్షలాది ప్రాంతాలకు జియో ఎయిర్ ఫైబర్ కనెక్టివిటీ లభించనుంది. ఫైబర్ తరహా వేగంతోనే డేటాను ఇది ప్రసారం చేస్తుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 41 నగరాల్లో ఉన్న వినియోగదారులు ఈ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా ప్రపంచ స్థాయి హోం ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ సేవలను ఆస్వాదించగలరు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!