(Source: ECI/ABP News/ABP Majha)
Jio TRAI: శాటిలైట్ నెట్‌వర్క్‌పై కన్నేసిన జియో - ట్రాయ్‌కి లేఖ!
Jio Letter To TRAI: రిలయన్స్ జియో ఇప్పుడు శాటిలైట్ నెట్‌వర్క్‌ను మనదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ట్రాయ్ తన శాటిలైట్ స్పెక్ట్రమ్ ధరపై కన్సల్టేషన్ పేపర్‌ను పునఃపరిశీలించాలని జియో పేర్కొంది.
Jio Satellite Network: శాటిలైట్ నెట్‌వర్క్‌ను తీసుకురావడానికి కంపెనీలు పెద్ద చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు రిలయన్స్ జియో కూడా అలాంటి ప్రయత్నమే చేస్తుందని వార్తలు వస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఈ విషయంలో ట్రాయ్‌కి సమాధానం ఇచ్చింది. వాస్తవానికి ట్రాయ్ తన శాటిలైట్ స్పెక్ట్రమ్ ధరపై కన్సల్టేషన్ పేపర్‌ను పునఃపరిశీలించాలని జియో పేర్కొంది. ఈ పేపర్లు టెరెస్ట్రియల్, శాటిలైట్ నెట్‌వర్క్ ప్రొవైడర్ల మధ్య సమన్వయం చేయవని జియో అభిప్రాయపడింది.
ఇది మాత్రమే కాకుండా ఎయిర్‌వేవ్‌ల కేటాయింపునకు సంబంధించి కూడా జియో అనేక ప్రశ్నలు లేవనెత్తింది. శాటిలైట్ ప్లేయర్లకు స్పెక్ట్రమ్ ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎవరైనా శాటిలైట్ నెట్‌వర్క్‌ని వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించాలనుకుంటే దాన్ని వేలం వేయాలని జియో చెబుతోంది. కానీ అలా చేయకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అంటే శాటిలైట్ స్పెక్ట్రమ్ వేలాన్ని జియో సీరియస్‌గా తీసుకుందని మనం అర్థం చేసుకోవాలి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
అంతకుముందు వ్యతిరేకత...
గతంలో ఇవే టెలికాం కంపెనీలు వేలాన్ని వ్యతిరేకించాయి. వేలం ప్రక్రియ తమ వ్యాపారానికి సరిపడదని చెప్పారు. ఒక నివేదిక ప్రకారం ఈ కన్సల్టేషన్ పేపర్లు, దాని ఫలితంగా వచ్చే సిఫార్సులు చట్టపరమైన సవాళ్లకు గురయ్యే అవకాశం ఉందని జియో ట్రాయ్‌కి లేఖ రాసింది.
ఈ సమస్యలన్నింటినీ ఇప్పుడు పరిశీలించాలని టెలికాం డిపార్ట్‌మెంట్ ట్రాయ్‌కి తెలిపింది. వాస్తవానికి వేలం లేకుండా ఈ స్పెక్ట్రమ్‌ను ఎవరూ పొందకూడదని జియో కోరుకుంటోంది. ఇందుకోసం అన్ని కంపెనీల ద్వారా ప్రక్రియ జరగాలి. శాటిలైట్ నెట్‌వర్క్ రేసులో గ్లోబల్ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ పేరు అగ్రస్థానంలో ఉందని, దీనిపై పూర్తిగా దృష్టి సారిస్తుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
The countdown is on for India's most-awaited technology convention. ⌛
— Reliance Jio (@reliancejio) October 8, 2024
Stay tuned. ✨#IMC2024 #WithLoveFromJio ♥️#IndiaMobileCongress #TheFutureIsNow #DigitalTransformation #JioAtIMC #JioTrue5G #JioNationBuilding #Jio@exploreIMC pic.twitter.com/svNYV88Aiw
Join us at India Mobile Congress 2024 as we step into the future of technology. Jio is proud to be at the heart of this revolution, driving progress and innovation for a new Bharat. 🇮🇳
— Reliance Jio (@reliancejio) October 7, 2024
We hope to see you there! #WithLoveFromJio ♥️#IndiaMobileCongress #TheFutureIsNow #IMC2024… pic.twitter.com/gpoanFHxDs
In the grand celebration of Ganeshotsav, we are honoured to connect millions of devotees across the world to their beloved Bappa. ♥️
— Reliance Jio (@reliancejio) September 23, 2024
A special thanks to the Lalbaugcha Raja Trust for their unwavering commitment, making this union of faith and technology a reality. 🫶🏼
Ganpati… pic.twitter.com/ZXXdekAlU4