By: ABP Desam | Updated at : 08 Jan 2022 02:35 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐకూ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.
ఐకూ 9, ఐకూ 9 ప్రో స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలోనూ ఇటీవలే లాంచ్ అయిన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. గేమర్ల కోసం ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ రూపొందించారు. ఇందులో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఉంది. ఐకూ 9 స్మార్ట్ ఫోన్‌లో ఫ్లాట్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ5 ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఐకూ 9 ప్రోలో 6.78 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఈ5 ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ ఓషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి.
ఐకూ 9 ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా (సుమారు రూ.47,000) ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,399 యువాన్లు (సుమారు రూ.51,600) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 4,799 యువాన్లుగా (సుమారు రూ.56,240) నిర్ణయించారు.
ఐకూ 9 ప్రో ధర
ఇందులో కూడా మూడు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. ఐకూ 9 ప్రోలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగా (సుమారు రూ.58,600) ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,499 యువాన్లుగా (సుమారు రూ.64,400) నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 యువాన్లుగా (సుమారు రూ.70,300) ఉంది. ఈ ఫోన్లు త్వరలోనే మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఐకూ 9 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ5 ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఐకూ 9లో అండర్ డిస్‌ప్లే కెమెరాను అందించారు.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా.. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
ఐకూ 9 ప్రో స్పెసిఫికేషన్లు
ఐకూ 9 ప్రోలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఇందులో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందించారు. 6.78 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ5 10-బిట్ ఎల్టీపీవో డిస్‌ప్లేను అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గా ఉంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ కెమెరా కూడా ఉన్నాయి. మిగతా ఫీచర్లన్నీ ఐకూ 9 తరహాలోనే ఉన్నాయి.
Also Read: ఐఫోన్ 12 సిరీస్‌పై సూపర్ ఆఫర్.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ రాలేదు!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
Big Billion Days 2023 Sale: బంపర్ ఆఫర్లతో రానున్న ఫ్లిప్‌కార్ట్ - బిగ్ బిలియన్ డేస్‌కు ముహూర్తం ఫిక్స్ - వేటిపై ఆఫర్లు!
Hyderabad News: హైదదరాబా లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ - 13, 300 మందికి పట్టాల అందజేత
Andriod: మీ స్మార్ట్ ఫోన్ డేటా వెంటనే అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి
WhatsApp New Feature: పేయూ, రేజర్‌పేతో వాట్సాప్ ఒప్పందం! గూగుల్‌లో వెతికే వెబ్‌పేజీ తయారు చేసుకొనే ఫీచర్
Women Reservation Bill: రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: విజయసాయి రెడ్డి
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Telangana Rains: తెలంగాణకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు అలర్ట్
/body>