Instagram Reels New Features: రీల్స్ చేసేవారికి గుడ్‌న్యూస్ - ఏకంగా 90 సెకన్ల వరకు - అందుబాటులోకి కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. రీల్స్ టైమ్‌ను 90 సెకన్ల వరకు పెంచారు.
![Instagram Reels New Features: రీల్స్ చేసేవారికి గుడ్‌న్యూస్ - ఏకంగా 90 సెకన్ల వరకు - అందుబాటులోకి కొత్త ఫీచర్లు! Instagram Adds New Features in Reels Duration Increased to 90 Seconds Instagram Reels New Features: రీల్స్ చేసేవారికి గుడ్‌న్యూస్ - ఏకంగా 90 సెకన్ల వరకు - అందుబాటులోకి కొత్త ఫీచర్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/0b835ac355f4c10049d86e868fed2329_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో రీల్స్ చేయడం మరింత సులభం కానుంది. ఈ కొత్త ఫీచర్లతో రీల్స్ మ్యాగ్జిమం డ్యురేషన్‌ను పెంచడంతో పాటు స్టిక్కర్లను కూడా యాడ్ చేశారు. అలాగే కొత్త ఆడియో ఫీచర్లు కూడా వచ్చాయి.
60 రోజుల టైం పీరియడ్‌లో, 10 వేల కంటే ఎక్కువ ఫాలోయర్లు ఉన్న పేజీలు రోజుకు కనీసం ఐదు రీల్స్ పోస్ట్ చేస్తే వారికి 2.5 రెట్లు వేగంగా ఎక్కువ ఫాలోయర్లు వస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ఎక్కువ ఫీచర్లు తీసుకువచ్చారు కాబట్టి ఎక్కువ మంది రీల్స్ చేస్తారని ఇన్‌స్టాగ్రామ్ అభిప్రాయపడుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొత్త ఫీచర్లు
ఇన్‌స్టాగ్రామ్ తాజాగా ఫ్రెష్ సౌండ్ ఎఫెక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ‘ఈ కొత్త సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా రీల్స్‌ను మరింత హాస్యంతో నింపవచ్చు. దీంతో వినియోగదారులు మరింత కనెక్ట్ అవుతారు.’ అని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు ఇక మీ ఆడియోను డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఆడియో ఫీచర్ ద్వారా కామెంటరీ లేదా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ యాడ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అందుబాటులో ఉన్న చాలా ఇంటరాక్టివ్ స్టిక్కర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అందుబాటులోకి రానున్న కొత్త స్టిక్కర్లు ఇవే:
పోల్: రెండు భాగాలుగా రీల్ చేస్తున్నారా? నెక్ట్స్ వీడియో ఎలా ఉండాలో ఫాలోయర్స్‌ను పోల్ రూపంలో అడగవచ్చు.
క్విజ్: ఈ స్టిక్కర్ ద్వారా మీ ఆడియన్స్ స్కిల్‌ను పరీక్షించవచ్చు.
ఎమోజీ స్లైడర్: స్టోరీస్ ఉండే ఎమోజీ స్లైడర్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి వచ్చారు.
చివరిగా రీల్స్ టైమ్‌ను కూడా పెంచారు. 90 సెకన్ల వరకు రీల్స్‌ను చేసుకోవచ్చు. తాజాగా లాంచ్ చేసిన టెంప్లేట్స్ ద్వారా రీసెంట్‌గా రీల్స్ క్రియేట్ చేయవచ్చు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)