అన్వేషించండి

IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?

IT Rules 2021 Amendments:మారుతున్న టెక్నాలజీతోపాటు పెరిగిపోతున్న ఫేక్ కంటెంట్‌ నియంత్రణపై కేంద్రం దృష్టి పెట్టింది. అందుకే ఇప్పటి వరకు ఉన్న చట్టానికి పదును పెట్టాలని చూస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐటీ రూల్స్ 2021లో మార్పులకు కేంద్రం సిద్ధమవుతోంది.
  • స్వతంత్ర కంటెంట్ క్రియేటర్ల పర్యవేక్షణ పెంచాలని యోచిస్తోంది.
  • ఏప్రిల్ 14 లోపు అభిప్రాయాలను సేకరించనున్న ప్రభుత్వం.
  • డీప్‌ఫేక్, ఏఐ నకిలీ కంటెంట్‌పై కఠిన చర్యలు.

IT Rules 2021 Amendments:భారత్‌లోని డిజిటల్ రంగంలో భావప్రకటనా స్వేచ్ఛ, నియంత్రణలపై మరోసారి చర్చ మొదలైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఐటీ రూల్స్‌ 2021ను మార్చాలని కేంద్రం చూస్తోంది. ఇందులో చేపట్టబోయే మార్పులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌ కంటెంట్‌పై కేంద్రం మరింత పట్టు సాధించే దిశగా చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. 

ఇప్పటి వరకు ప్రభుత్వ గుర్తించిన మీడియా, పబ్లిషర్స్‌ను మాత్రమే నియంత్రించగలిగేది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఇతర స్వతంత్ర కంటెంట్ క్రియేటర్లు పెట్టే కంటెంట్‌ను నియంత్రించడం కానీ, ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకురావచ్చు. అంటే నేరుగా అవన్నీ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి.

ముఖ్యంగా పార్ట్‌III(రూల్‌8) మార్పుల ప్రకారం, అధికారికంగా వార్తా సంస్థలుగా గుర్తించిన వ్యక్తులు చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు లేదా పబ్లిక్‌ అఫైర్స్ కంటెంట్‌ను హోస్ట్‌ చేసే ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షణ పెరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్‌ను చదివిన తర్వాత మీరు దానిపై స్పందిస్తే కచ్చితంగా ఆ విషయం ప్రభుత్వ నియంత్రలోకి వస్తుంది. అంటే దానిపై ప్రభుత్వం రూల్స్‌కు లోబడి ఉందా లేదా అనేది పరిశీలించవచ్చు. 

కొత్తగా రూపొందించిన రూల్స్‌పై ప్రభుత్వం అభిప్రాయసేకరణ చేస్తోంది. వీటిపై మీకు ఉన్న అభిప్రాయాన్ని ఏప్రిల్ 14వ తేదీ లోపు చెప్పాల్సి ఉంటుంది. అప్పటి వరకు వివిధ వర్గాల నుంచి వచ్చిన స్పందనలను క్రోడీకరించి బిల్లులో మార్పులు చేర్పులు చేయనున్నారు. 

ఐటీ చట్టం సెక్షన్ 79, సేఫ్‌ హార్బర్‌ రూల్స్‌

ప్రతిపాదిత మార్పుల ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, సలహాలు, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద సేఫ్‌ హార్బర్‌ ప్రయోజనాలను పొందాలంటే ప్లాట్‌ఫామ్‌లు ఈ మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి అని రూల్‌ 3(4) స్పష్టం చేస్తోంది. 

దీనిపై ఐఎఫ్‌ఎఫ్‌ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం ఎక్కువ అవుతుందని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని రూల్స్‌ బహిర్గతం కాకపోవచ్చని, దీని వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని అంటున్నారు. ఇది రాజ్యాంగ సూత్రాలు విరుద్ధమని వాదిస్తున్నారు.

ముప్పు పొంచి ఉందంటున్న ప్రభుత్వం 

మారుతున్న టెక్నాలజీని అందరూ సక్రమంగా వాడుకోవడం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఐటీ చట్టంలో తీసుకొచ్చే మార్పులపై స్పందించిన మంత్రి అశ్విని వైష్ణవ్‌ డీప్‌ఫేక్, ఏఐ కంటెంట్‌ను చూపిస్తున్నారు. వీటి ద్వారా సృష్టించే నకిలీ కంటెంట్‌ వల్ల భారీ ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఇలాంటి కంటెంట్‌కు బ్రేక్ వేయడానికే చట్టానికి పదును పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీసుకుంటున్నాయని వివరించారు. 

Frequently Asked Questions

ఐటీ రూల్స్ 2021లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయాలని చూస్తోంది?

ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021ను మార్చాలని చూస్తోంది, దీని ద్వారా ఆన్లైన్ కంటెంట్పై, ముఖ్యంగా స్వతంత్ర కంటెంట్ క్రియేటర్ల పోస్టులపై మరింత పట్టు సాధించాలని భావిస్తోంది.

పార్ట్ III (రూల్ 8) లోని మార్పుల వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది?

అధికారికంగా వార్తా సంస్థలుగా గుర్తించబడిన వ్యక్తులు చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు లేదా పబ్లిక్ అఫైర్స్ కంటెంట్ను హోస్ట్ చేసే ప్లాట్ఫామ్లపై పర్యవేక్షణ పెరుగుతుంది.

కొత్తగా రూపొందించిన రూల్స్ పై ప్రభుత్వం అభిప్రాయ సేకరణ ఎప్పటివరకు చేస్తోంది?

కొత్త రూల్స్ పై ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ లోపు అభిప్రాయాలను సేకరిస్తోంది. ఆ తర్వాత వచ్చిన స్పందనల ఆధారంగా బిల్లులో మార్పులు చేయనుంది.

ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద సేఫ్ హార్బర్ ప్రయోజనాలను పొందడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏమి చేయాలి?

సేఫ్ హార్బర్ ప్రయోజనాలను పొందాలంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, సలహాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను తప్పనిసరిగా పాటించాలి.

ఐటీ రూల్స్ మార్పులపై ప్రభుత్వం ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తోంది?

మారుతున్న టెక్నాలజీని అందరూ సక్రమంగా ఉపయోగించుకోవడం లేదని, డీప్ఫేక్, ఏఐ కంటెంట్ వంటి నకిలీ కంటెంట్ వల్ల భారీ ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget