Whatsapp Tips: నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్ చేయండిలా - నిమిషం కూడా పట్టదు!
వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ పంపాలనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!
ప్రపంచంలో నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా నిలిచిన వాట్సాప్‌లో (Whatsapp) మనకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్ బాగా యూజర్ ఫ్రెండ్లీ కూడా. అయితే కొన్నిసార్లు యాప్‌లో అందుబాటులో లేని చిన్న చిన్న ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది నంబర్ సేవ్ చేసుకోకపోతే మెసేజ్ చేయలేకపోవడం. వాట్సాప్‌లో చిన్న డాక్యుమెంట్, ఒకే ఒక్క మెసేజ్ ఏది పంపాలన్నా వారి నంబర్ మన ఫోన్‌లో సేవ్ చేయాల్సిందే.
కానీ మీరు కాంటాక్ట్ యాడ్ చేయకుండానే మెసేజ్ పంపడానికి ఒక దారి ఉంది. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా మీరు నంబర్ సేవ్ చేయకుండా టెక్స్ట్ పంపవచ్చు. కానీ ఇటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ప్రైవసీకి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటి వల్ల మీ వాట్సాప్ ఖాతా బ్యాన్ అయ్యే అవకాశం కూడా ఉంది.
వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ పంపడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.
1. మొదట బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ అడ్రెస్ బార్‌లో "https://wa.me/phonenumber" పేస్ట్ చేయండి.
2. పైన phonenumber అని ఉన్న మీరు ఎవరికి మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి టైప్ చేయండి.
3. ఉదాహరణకు మీరు 9848022338 నంబర్‌కు మెసేజ్ చేయాలనుకుంటే "https://wa.me/9848022338" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
4. వెంటనే మీకు కింద విండోలో "Continue Chat" అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అది నేరుగా వాట్సాప్‌కు రీడైరెక్ట్ అవుతుంది.
5. అక్కడ చాట్ విండో ఓపెన్ అవుతుంది. మీరు నంబర్ సేవ్ చేయకుండానే మెసేజ్ పంపేయచ్చు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram