Smartphone Tips: ఫోన్ హిస్టరీ క్లియర్ చేసినా ఏం చూశారో తెలుసుకోవచ్చు - చాలా చిన్న సీక్రెట్ ట్రిక్!
స్మార్ట్ ఫోన్‌లో యాప్ హిస్టరీ క్లియర్ చేసినా అందులో ఏం చేశారో తెలుసుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే?
మనం ఫోన్‌లో ఉపయోగించాక యాప్ హిస్టరీ క్లియర్ చేస్తే మనం ఏ యాప్స్ బ్రౌజ్ చేశామో ఎవరికీ తెలియదని అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. మీ ఫోన్‌లో చిన్న ట్రిక్ ఫాలో అయితే ఏ యాప్‌ను ఎంతసేపు ఉపయోగించారో కూడా తెలుసుకోవచ్చు.
దానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవే...
1. ముందుగా మీ మొబైల్‌లో ‘కాలింగ్’ యాప్‌ను ఓపెన్ చేయండి.
2. డయలర్‌కు వెళ్లి *#*#4636#*#* నంబర్‌కు డయల్ చేయండి.
3. అంతే మీ ఫోన్‌లో మీరు ఏ యాప్స్‌ను ఎంత సేపు ఉపయోగించారో అక్కడ కనిపిస్తుంది.
మీ ఫోన్ వేరేవారికి ఇస్తే... వారు ఏ యాప్స్ ఉపయోగించారో దీని ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇందులో కేవలం యాప్ పేరు, అది ఉపయోగించిన సమయం తెలుస్తుంది తప్ప, ఆ యాప్‌లో ఏం చూశారో తెలియదు. ఉదాహరణకు వారు ఫేస్‌బుక్ ఉపయోగించారనుకోండి. గంట సేపు ఫేస్ బుక్ ఉపయోగించినట్లు తెలుస్తుంది తప్ప, ఫేస్‌బుక్‌లో ఏం చూశారు? ఎవరితో చాట్ చేశారు? లాంటి విషయాలు తెలియవు.
అలాగే గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తే... బ్రౌజర్ ఉపయోగించినట్లు తెలుస్తుంది తప్ప, అందులో వాళ్లు ఏం సెర్చ్ చేశారు? ఏం చూశారు? లాంటి విషయాలు తెలుసుకోలేం. ఇంట్లో పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్లు ఏ యాప్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? అని కూడా ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ ట్రిక్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram