Battery Health in Android Smartphones: ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయడం ఎలా? - సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండిలా!
Battery Health: కొన్ని చిన్న స్టెప్స్ ఫాలో అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
Android Phone Battery Health: ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వివిధ ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి అనేక రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మన ఆప్షన్ ప్రకారం అనేక రకాల సెట్టింగ్‌లను కూడా మార్చుకోవచ్చు. మీరు డేటా సెట్టింగ్, కాంటాక్ట్ సెట్టింగ్, కెమెరా సెట్టింగ్ వంటి అనేక పనులు చేయవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో బ్యాటరీ హెల్త్ తెలుసుకోవడానికి కంపెనీలు మీకు ప్రత్యేకమైన ఆప్షన్ ఇవ్వవు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ హెల్త్ ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకుందాం. దీని అర్థం ఇప్పుడు మీరు దాని పవర్ ఎంత ఉందో, మీరు బ్యాటరీని ఎప్పుడు మార్చవలసి ఉంటుంది అని తెలుసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మీరు గత 24 గంటల బ్యాటరీ వినియోగాన్ని చూడవచ్చు. బ్యాటరీ వినియోగాన్ని తెలుసుకోవాలంటే సెట్టింగ్స్‌లోని బ్యాటరీ ఆప్షన్‌కు వెళ్లాలి. గత 24 గంటల్లో బ్యాటరీ వినియోగం ఎంత ఉందో, ఏ యాప్ ఎక్కువ బ్యాటరీని వినియోగించిందో ఇక్కడ నుండి మీరు చూడవచ్చు.
శాంసంగ్ ఫోన్‌లలో బ్యాటరీ హెల్త్ ఇలా తెలుసుకోవచ్చు
మీ దగ్గర శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఉంటే అందులోని బ్యాటరీ స్టేటస్ తెలుసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'శామ్‌సంగ్ మెంబర్ యాప్' డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత యాప్‌లోని 'అసిస్టెంట్' ట్యాబ్ కింద 'సపోర్ట్'కి వెళ్లి, 'ఫోన్ డయాగ్నోస్టిక్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆపై బ్యాటరీ ఎంపికపై క్లిక్ చేసి బ్యాటరీ డయాగ్నస్టిక్‌ను ప్రారంభించండి. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ యాప్ బ్యాటరీ ఆరోగ్యం ఎలా ఉంది? దాన్ని మార్చాల్సిన అవసరం ఉందా లేదా అని మీకు తెలియజేస్తుంది.
యాప్ ద్వారా కూడా
మీరు శాంసంగ్ కాకుండా ఇతర స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తుంటే మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి 'AccuBattery' అనే మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఫోన్‌ను 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయండి. దీని తర్వాత యాప్ పని చేయడం ప్రారంభిస్తుంది. మీ బ్యాటరీ కండీషన్ ఏంటో కూడా మీరు తెలుసుకోవచ్చు.
మరోవైపు వాట్సాప్, గూగుల్ సంస్థలు త్వరలో ఛాట్ బ్యాకప్ కోసం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ కోటాను ముగించనున్నాయి. ప్రస్తుతం మీరు వాట్సాప్‌లో ఎంత డేటానైనా ఉచితంగా బ్యాకప్ చేయవచ్చు. అయితే త్వరలో కంపెనీ దీన్ని కేవలం 15 జీబీకి మాత్రమే పరిమితం చేయబోతోంది. అంటే మీ గూగుల్ అకౌంట్లో ఎంత స్పేస్ ఖాళీ ఉంటుందో అంత డేటాను మాత్రమే బ్యాకప్ చేయగలరన్న మాట. ఇప్పటి వరకు వాట్సాప్ బ్యాకప్‌ను గూగుల్ తన అకౌంట్ స్టోరేజ్‌లో భాగంగా పరిగణించేది కాదు. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండబోదు. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా అప్‌డేట్ చేసింది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!