X

Tech Tips: ఫోన్ పోయిందా? గూగుల్ పే, ఫోన్ పే డిలీట్ చేయాలనుకుంటున్నారా?

ఫోన్ పోయింది.. అరే.. అందులో డిజిటల్ పేమెంట్స్ యాప్స్ అన్నీ ఉన్నాయే.. అని భయపడుతున్నారా? ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి.. ఆ అకౌంట్లను బ్లాక్ చేయండి.

FOLLOW US: 

ఎదో పనిమీద బయటకు వెళ్తాం.. లేదా ఇంకేదో కారణంతో ఫోన్ పోతుంది. అందులో విలువైన సమాచారం ఉందే అని టెన్షన్ పడిపోతుంటాం. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి ఖాతాలుంటే.. డబ్బులు ఏమవుతాయోననే ఆలోచనలో ఉంటాం. కానీ .. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే డిజిటల్ పే మెంట్ యాప్స్ అకౌంట్లను పోయిన ఫోన్ లో బ్లాక్ చేయోచ్చు.

ఇప్పుడు ప్రతీ దానికి.. డిజిటల్ పే మెంట్ యాప్సే. రూపాయి నుంచి.. వేల రూపాయల చెల్లింపులకు అవే దిక్కు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్-యూపీఐతో కనెక్షన్ ఉన్న పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్స్ ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటుంది. ఒక వేళ ఫోన్ పోతే.. వాటి సమాచారం ఎలా అని భయపడుతాం. ఫోన్ పోయినప్పుడు డిజిటల్ పేమెంట్ యాప్స్ ను ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం.. 
పేటీఎం ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయండిలా.. పేటీఎం హెల్ప్‌లైన్ నంబర్ 012 0445 6456కు కాల్ చేయండి.. ఫోన్​ లాస్ట్ ఆప్షన్​ ఎంచుకోండి. న్యూ నంబర్ నమోదు ఆప్షన్ ను ఎంచుకోవాలి.  పోయిన ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత లాగ్ అవుట్ ఫ్రం ఆల్ డివైసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి.

గూగుల్ పే అకౌంట్ ను బ్లాక్ చేయండిలా...
గూగుల్ పే హెల్ప్‌లైన్ నెంబర్ 1800 4190 157కు కాల్ చేయండి. మాతృభాషను ఎంచుకోండి. ఇతర సమస్యల కోసం సరైన ఎంపికను చేసుకోవాలి. ఖాతాను బ్లాక్ చేసేందుకు కాల్ మాట్లాడే ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు రిమోట్ వైప్ ద్వారా వారి డేటాను తీసేయోచ్చు.

ఫోన్ పే అకౌంట్ ను ఇలా బ్లాక్ చేయండి..
ఫోన్ పే యూజర్లు 0806 8727 374, 0226 8727 374కు కాల్ చేసి వివరాలను తెలపాలి. లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకున్నాక..  సమస్యను తెలిపేందుకు తగిన నెంబర్​ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ పేలో రిజిస్టర్ అయి ఉన్న... మెుబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ధ్రువీకరణ కోసం ఓటీపీ వస్తుంది. అయితే ఓటీపీ రాలేదనే.. ఆప్షన్​ను ఎంపిక చేయాలి.  ఫోన్ పోయినట్లు చూపే ఆప్షన్​లలో ఒకదాన్ని  సెలక్ట్ చేసుకోవాలి. ఫోన్ నంబర్, ఈ-మెయిల్, ఫోన్​పై ద్వారా చేసిన చివరి చెల్లింపు విలువ వంటి వివరాలను అడుగుతుంది. అనంతరం మీ అకౌంట్ బ్లాక్ చేసేందుకు నిపుణులతో కాల్ మాట్లాడాలి.

పేటీఎం ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేయండిలా.. 

పేటీఎం వెబ్ సైట్ కు వెళ్లండి. 24 గంటల సాయాన్ని సెలక్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ ఏ ఫ్రాడ్ అని కొట్టండి. ఇంకా ఏదైనా వేరే కారణం ఉంటే.. వేరే కారణంపైన క్లిక్ చేయోచ్చు. ఏదైనా చెప్పాలనుకుంటే ఎనీ ఇష్యూపై క్లిక్ చేయండి.  పేటీఎం ఖాతా లావాదేవీలను ధ్రువీకరించే డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్​మెంట్​ను సమర్పించాలి. అలాగే ఫోన్ పోగొట్టుకున్న, దొంగతనానికి సంబంధించి నిర్ధరణను ఇవ్వాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న అంశాలు పూర్తయిన తరువాత పేటీఎం మీ ఖాతాను ధ్రువీకరించి బ్లాక్ చేస్తుంది. అందుకు సంబంధించి మీరు ఇచ్చిన ప్రత్యామ్నాయ నెంబర్​కు మెసెజ్ వస్తుంది.

Also Read: Find a lost phone: మీ ఫోన్ పోయిందా ?.. నో ప్రాబ్లమ్ ఇలా చేస్తే దొరుకుతుంది సింపుల్!

Tags: Tech Tips Phone pe Google pay Pay tm

సంబంధిత కథనాలు

Samsung F23 5G: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ప్రాసెసర్ వివరాలు లీక్!

Samsung F23 5G: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ప్రాసెసర్ వివరాలు లీక్!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Oppo Reno 7 5G: ఒప్పో కొత్త 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. మొదటిసారి ఆ కెమెరాలతో.. ధర ఎంతంటే?

Oppo Reno 7 5G: ఒప్పో కొత్త 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. మొదటిసారి ఆ కెమెరాలతో.. ధర ఎంతంటే?

Samsung Price Cut: ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు.. భారీ ఆఫర్!

Samsung Price Cut: ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు.. భారీ ఆఫర్!

Redmi Note 11S: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. ధర రూ.20 వేలలోపే?

Redmi Note 11S: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. ధర రూ.20 వేలలోపే?

టాప్ స్టోరీస్

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

Gold Silver Price Today 25 January 2022 : దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగా... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

ఏటీఎంలో నకిలీ నోట్లు డిపాజిట్‌ చేసే ముఠా అరెస్టు.. కర్నూలులో కలకలం

Petrol Diesel Price 25 January 2021: తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... హైదరాబాద్ లో మాత్రం స్థిరంగా...

Petrol Diesel Price 25 January 2021: తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... హైదరాబాద్ లో మాత్రం స్థిరంగా...

Horoscope Today 25 January 2022: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today 25 January 2022: ఈ రోజు కార్యాలయంలో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి...